ఐనవోలు, జూన్ 7: వైద్యం వికటించడంతో బాధితురాలి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండ జిల్లా ఐనవో లు మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. మండలకేంద్రాని కి చెందిన గందెపల్లి ఉప్పల మ్మ(59) గత 30న రెండుసార్లు వంతులు చేసుకుంది. వెంటనే కుటుంబ సభ్యులు ఇంటికే ఆర్ఎంపీ వైద్యుడిని రప్పించారు. పరీక్షించిన అతడు వృద్ధురాలి కుడిచేయికి స్లైన్ ఎక్కించాడు.
రెండురోజుల తర్వాత ఆమె చేయి పని చేయకపోవడంతో వరంగల్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చూపించారు. పరీక్షించిన వైద్యుడు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు రెఫర్ చేశాడు.అక్కడికి తీసుకెళ్లగా ఉప్పలమ్మ చేయిని తొలగించాలని వైద్యులు చెప్పారు. అలాగే, ఆమెను వరంగల్ ఎంజీఎం దవాఖానకు తీసుకెళ్లాలని పంపించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులు దవా ఖానలో ఆమెను చేర్పించారు. ఉప్పలమ్మ చేయి తొలగించాలని చెప్పడంతో ఆమె కొడుకు, కోడలు గందెపల్లి రాజు, అపర్ణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.