నర్సంపేటలో రూ.41 లక్షల విలువైన నకిలీ విత్తనాలు పట్టివేత
నకిలీ విత్తనాలు| నకిలీ విత్తనాల విక్రేతలపై పోలీసులు కోరడా ఝళిపిస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేటలో భారీగా నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. నర్సంపేటలోని విత్తన దుకాణాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు.

వరంగల్ రూరల్: నకిలీ విత్తనాల విక్రేతలపై పోలీసులు కోరడా ఝళిపిస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేటలో భారీగా నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. నర్సంపేటలోని విత్తన దుకాణాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.41 లక్షల విలువైన నకిలీ మిరప విత్తనాలను పట్టుకున్నారు. మొత్తం 1,677 నకిలీ మిరప విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల క్రితం ఖమ్మం జిల్లాలో కూడా భారీగా నకిలీ మిరప విత్తనాలు పట్టుబడ్డాయి. జిల్లాలోని జూలూర్పాడ్లో రూ.1.50 లక్షల విలువైన నకిలీ విత్తనాలను సీజ్‌చేసి, 120 ప్యాకెట్ల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
నకిలీలపై ఉక్కుపాదం
నాసిరకం విత్తన ముఠాలపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝళిపిస్తున్నది. మండల, జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్ బృందాలు, స్థానిక పోలీసులతోపాటు ఐజీ నాగిరెడ్డి నేతృత్వంలో ఐదు రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్ బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా 878 క్వింటాళ్ల నాసిరకం విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్టు సీడ్ టాస్క్‌ఫోర్స్ ఇంచార్జి, నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి వెల్లడించారు. నకిలీ విత్తనాలకు సంబంధించి 101 కేసులు నమోదుచేసి, 159 మంది నిందితులను అరెస్టు చేసినట్టు చెప్పారు. నాసిరకం విత్తనాలు విక్రయించేవారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేస్తున్నారు. వరుసగా రెండోసారి పట్టుబడితే పీడీయాక్ట్ కింద బుక్ చేస్తున్నారు. ఈ కేసుల్లో ఇప్పటికే 28 మందిపై పోలీసులు పీడీ చట్టాన్ని ప్రయోగించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స.. ఆస్పత్రికి తరలింపు
Crime News | ఆ బంధానికి అడ్డుగా ఉన్నాడని 24 ఏళ్ల కొడుకును ప్రియుడితో కలిసి చంపిన తల్లి..!
Om | ‘ఓమ్’ చిత్రంలో సాయిపల్లవి పవర్ఫుల్ పోలీస్ రోల్.. ఆ రియల్ ఆఫీసర్ స్పూర్తే కారణం!
రేవంత్ రెడ్డికి మెడికవర్ హాస్పిటల్స్‌పై ఉన్న శ్రద్ధ ప్రభుత్వ దవాఖానలపై ఎందుకు లేదు? : మన్నె క్రిశాంక్
కారేపల్లి మండల అభివృద్ధి పనులపై సమీక్షించిన ప్రత్యేక అధికారి ఆలేటి ప్రమీల
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

