2023కి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరం 2024కి స్వాగతం పలికేందుకు అంతా సిద్ధమయ్యారు. చిన్నాపెద్దా అంతా వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోనున్నారు. న్యూ ఇయర్ కేకుల కొనుగోళ్లతో బేకరీలు, మద్యం దుకాణాలు, తీరొక్క రంగుల కొనుగోళ్లతో మార్కెట్లన్నీ కళకళలాడాయి. దీంతో ఆదివారం రాత్రి ఎక్కడచూసినా సందడి వాతావరణం కనిపించగా యువత కేరింతలతో వీధులు, కళాశాలల్లో జోష్ నెలకొంది.
అర్ధరాత్రి 12 తర్వాత సోషల్ మీడియా వేదికగా ‘హ్యాపీ న్యూఇయర్’ శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అదే సమయంలో సెలబ్రేషన్స్ శ్రుతి మించకుండా అదుపుచేయడంతో పాటు నగరంలోని అన్ని జంక్షన్లు, శివారు ప్రాంతాలు, ఔటర్ రింగ్ రోడ్డు వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తూ పోలీసులు అర్ధరాత్రి రోడ్లపైనే గస్తీ నిర్వహించారు.