ములుగు రూరల్, జనవరి 2 : వృద్ధుడిపై జిల్లా కేంద్రంలో పోక్సో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. జంగాలపల్లి గ్రామానికి చెందిన 65 ఏండ్ల వయస్సు గల సూర కొమురయ్య 14 ఏండ్ల బాలికపై లైంగికదాడికి యత్నించినట్లు తెలిపారు. నాలుగు రోజుల క్రితం వెంకటాపూర్ మండలానికి చెందిన దంపతులు కూలీ పనుల నిమిత్తం జంగాలపల్లికి రాగా వారితో బాలిక వచ్చిందన్నారు.
వారు కూలీ పనులు చేస్తుండగా ఒంటరిగా ఉన్న బాలికపై కొమురయ్య లైంగి కదాడికి యత్నించాడు. విషయం తల్లిదండ్రులకు తెలుపగా కొముర య్య రాజీ ప్రయత్నాలను చేసి విషయం బయటకు రాకుండా ప్రయత్నించాడన్నారు. ఆదివారం బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మే రకు కొమురయ్యపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.