హనుమకొండ చౌరస్తా : అక్రమ అరెస్టులు ( Illegal Arrest ) , ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు నిదర్శనమని బీఆర్ఎస్వీ ( BRSV ) నాయకులు పస్తం అనిల్‌కుమార్ అన్నారు. బీఆర్ఎస్వీ నాయకులను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు ఎదుట గురువారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ దిష్టిబొమ్మను (Government Effigy) దహనం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనిల్‌కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పై పోరాడుతున్న బీఆర్ఎస్వీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం ప్రభుత్వ పిరికిపంద చర్యని మండిపడ్డారు. అరెస్టులతో విద్యార్థి లోకం గొంతు నొక్కలేరని పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ, పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అరెస్టు చేసిన విద్యార్థి నాయకులను భేషరతుగా విడుదల చేయాలని, లేనిపక్షంలో కాకతీయ విశ్వవిద్యాలయం వేదికగా రాష్ర్టవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ బీఆర్ఎస్వీ రాష్ట్ర సీనియర్ నాయకు లు కత్తెరపల్లి దామోదర్, కోరపెల్లి రాజేష్, అభిలాష్, రాసూరి రాజేష్ పాల్గొన్నారు.