4th Battalion | మామునూర్ 4వ బెటాలియన్ లో డీఐజీ వార్షిక తనిఖీలు
మామునూర్ 4వ బెటాలియన్ లో TGSP, బెటాలియన్ డీఐజీ సీ సన్నీ బుధవారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. మొదటగా బెటాలియన్ కమాండెంట్ బీ రామ్ ప్రకాష్ పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానం పలికారు.
4th Battalion | కరీమాబాద్, జూలై 16 : మామునూర్ 4వ బెటాలియన్ లో TGSP, బెటాలియన్ డీఐజీ సీ సన్నీ బుధవారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. మొదటగా బెటాలియన్ కమాండెంట్ బీ రామ్ ప్రకాష్ పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానం పలికారు. అనంతరం డీఐజీ గౌరవ వందనం స్వీకరించి బెటాలియన్ వార్షిక తనిఖీలో భాగంగా మోటార్ ట్రాన్స్ పోర్ట్, బెటాలియన్ వెల్ఫేర్,హెడ్ క్వార్టర్, యూనిట్ హాస్పిటల్, పెట్రోల్ బంక్, QM ఆఫీసులను తనిఖీ చేసి వాటి నిర్వహణ సక్రమంగా ఉందని తెలిపారు.
బెటాలియన్ కార్యనిర్వాహణ సక్రమంగా ఉండడంపై కమాండెంట్ ను అభినందించారు. ఈ సందర్భంగా డీఐజీ బెటాలియన్ సిబ్బంది యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు కృష్ణ ప్రసాద్, శ్రీనివాస్, వీరన్న, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

