వనదేవతలకు నీరాజనం
వనదేవతలు సమ్మక్క-సారలమ్మకు భక్తులు నీరాజనాలు పలుకుతున్నారు. గంటల తరబడి లైన్లలో నిల్చుని అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. గురువారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ప్రైవేట్, ఆర్టీసీ బస్సుల్లో మేడారానికి చేరుకున్నారు.
- మేడారానికి పోటెత్తుతున్న భక్తులు
- రాత్రి, పగలు రోజంతా మొక్కులే
తాడ్వాయి, ఫిబ్రవరి15 : వనదేవతలు సమ్మక్క-సారలమ్మకు భక్తులు నీరాజనాలు పలుకుతున్నారు. గంటల తరబడి లైన్లలో నిల్చుని అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. గురువారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ప్రైవేట్, ఆర్టీసీ బస్సుల్లో మేడారానికి చేరుకున్నారు. జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం వాగు ఒడ్డున గల నాగులమ్మ, జంపన్న గద్దెలకు ప్రత్యేక పూజలు నిర్వహించి సంతాన ముడుపులు కడుతున్నారు. సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు సమర్పించి గిరిజన సంప్రదాయం ప్రకారం పూజలు చేశారు. రోజంతా దర్శనాలు చేసుకుంటున్న భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ రాత్రి వేళలో కూడా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఇందుకు అనుగుణంగా దేవాదాయ శాఖ అధికారులు సైతం ఏర్పాట్లు చేశారు.
భక్తులతో నిండిపోయిన వనాలు
వివిధ ప్రాంతాల నుంచి గురువారం భారీగా తరలివచ్చిన భక్తులతో జాతర పరిసరాలు జనమయంగా మారాయి. తాడ్వాయి నుంచి మేడారం, మేడారం నుంచి పస్రా, కాల్వపల్లి, బయ్యక్కపేట, చిలకలగుట్ట తదితర ప్రాంతాల్లో విడిది చేశారు. రోజంతా పచ్చని అడవిని ఆస్వాదిస్తూ విందు భోజనాలు చేస్తున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

