సీఎం కేసీఆర్‌తోనే ఆలయాల అభివృద్ధి
సీఎం కేసీఆర్‌తోనే ఆలయాలు అభివృద్ధి చెందాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఐనవోలు మల్లికార్జునస్వామి దేవస్థాన ధర్మకర్తల పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్‌రావుతో కలిసి హాజరయ్యారు.
- వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్
- ఐనవోలు మల్లన్న ఆలయ ధర్మకర్తల పాలకమండలి ప్రమాణ స్వీకారం
- పాల్గొన్న డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు
ఐనవోలు ఏప్రిల్ 17: సీఎం కేసీఆర్‌తోనే ఆలయాలు అభివృద్ధి చెందాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఐనవోలు మల్లికార్జునస్వామి దేవస్థాన ధర్మకర్తల పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్‌రావుతో కలిసి హాజరయ్యారు. డప్పుచప్పుళ్లు, కోలాట నృత్యాలతో ఎమ్మెల్యేకు పలికారు. అనంతరం మల్లన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దేవాదాయ, ధర్మాదాయశాఖ వరంగల్ డివిజనల్ పరిశీలకుడు సంజీవరెడ్డి, ఈవో అద్దంకి నాగేశ్వర్రావు, ఎమ్మెల్యే సమక్షంలో 13మంది ధర్మకర్తలు, ఎక్స్ అఫీషియో మెంబర్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ధర్మకర్తలు చెందిన మజ్జిగ జయపాల్‌ను చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో ఐనవోలు ఆలయ అభివృద్ధికి రూ.10కోట్లు కేటాయించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఉన్న పరిస్థితి, అధికారంలో తాను ఎమ్మెల్యేగా బాధ్యత స్వీకరించిన తర్వాత ఏవిధంగా అభివృద్ధి చెందిందో కళ్ల ముందు కనబడుతోందన్నారు.
ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయని, ఆలయం లోపల, బయట అండర్ డ్రైనేజీ, అద్దాల మండపం, రాజగోపురం, ఎల్లమ్మ దేవాలయం పునర్నిర్మాణం, నాయీబ్రాహ్మణులు, ఒగ్గు పూజారులకు విశ్రాంత భవనాలు వంటి తదితర పనులు చేపట్టనున్నట్లు వివరించారు. ఆలయ చైర్మన్‌గా గొల్ల కురుమలకు అవకాశం కల్పిస్తానని మాటిచ్చానని, అందుకు కట్టుబడి మజ్జిగ జయపాల్‌ను చైర్మన్ చేశామని తెలిపారు. ఈవో అద్దంకి నాగేశ్వర్రావు పనితీరును ఎమ్మెల్యే అరూరి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు ప్రశంసించారు. జడ్పీ వైస్ చైర్మన్ శ్రీరా ములు, కుడా చైర్మన్ సుందర్రాజు, వైస్ ఎంపీపీ మోహన్, వర్ధన్నపేట చైర్మన్ అరుణ, ఎంపీపీ అప్పారావు, జడ్పీటీసీ భిక్షపతి, ధర్మకర్తలు రాజబాబు, వీరస్వామి, సాయిలు, స్వప్న, లక్ష్మణ్, సాయిలు, రాజు, వెంకటేశ్వర్లు, ఉపేందర్, సత్తయ్య, రాజు, సమ్మిరెడ్డి, ఎక్స్అఫీషియో మెంబర్ రవీందర్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
అందరి సహకారంతో అభివృద్ధి
ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయానికి చైర్మన్ కావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నా. ఇది ఎమ్మెల్యే అరూరి, డీసీసీబీ చైర్మన్ మార్నేని సహకారంతో నెరవేరింది. ధర్మకర్తలు, అధికా రులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ఆలయాభివృద్ధికి కృషి చేస్తాన. ఎమ్మెల్యే అరూరి రమేశ్ రుణం తీర్చుకోలేనిది.
– మజ్జిగ జయపాల్, ఆలయ కమిటీ చైర్మన్
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

