సమ్మెలో జూనియర్ డాక్టర్లు
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. వరంగల్ ఎంజీఎం దవాఖానలోని గాంధీ విగ్రహం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ..
- సమస్యలు పరిష్కరించి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్
- ఎంజీఎం దవాఖానలో వైద్య సేవల్లో అంతరాయం.. ఇబ్బందిపడ్డ రోగులు
కాశీబుగ్గ, జూన్ 23 : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. వరంగల్ ఎంజీఎం దవాఖానలోని గాంధీ విగ్రహం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ.. సకాలంలో ైస్టెఫండ్, దవాఖానలలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ విషయాన్ని నెల రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం, వైద్య ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కొన్ని రోజులుగా వివిధ రూపాల్లో నిరసన తెలిపామన్నారు. సోమవారం నుంచి ఎమర్జెన్సీ సేవలు మినహా అన్ని వైద్య సేవలకు తాము దూరంగా ఉన్నట్లు తెలిపారు.
దవాఖానకు వచ్చే పేద, మధ్య తరగతి రోగులకు మెరుగైన వైద్యం అందించాలంటే తప్పనిసరిగా మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. కొత్తగా ఏర్పాటు చేసిన వైద్యకళాశాలల్లో సరిపడా సిబ్బంది, వైద్య పరికరాలు, భవనాలు, సదుపాయాలు లేవని, వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. కాగా, వరంగల్ ఎంజీఎం దవాఖానలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగడంతో రోగులు వైద్య సేవలు అందక ఇబ్బందిపడ్డారు. జూనియర్ డాక్టర్లు, పీజీ వైద్యులు, సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యార్థులు ఎమర్జెన్సీ సేవలు తప్ప మిగతా విధులకు దూరంగా ఉన్నారు. దీంతో దూర ప్రాంతా ల నుంచి వచ్చిన రోగులకు వైద్యం అందక అవస్థలు పడ్డారు. ఓపీలో పెద్ద ఎత్తున క్యూలో రోగులు వేచి ఉన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

