అమరవీరుల త్యాగం వెలకట్టలేనిది
తెలంగాణ బిడ్డలను కాంగ్రెస్ పార్టీ బలితీసుకుందని, రాష్ట్ర ఏర్పాటుకు అమరవీరుల త్యాగం వెలకట్టలేనిదని, వారికి సమాజం ఎంతో రుణపడి ఉంటుందని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు.
- తెలంగాణ బిడ్డల ప్రాణాలను బలి తీసుకున్నది కాంగ్రెస్సే..
- బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం
- అమరవీరుల స్తూపం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ
హనుమకొండ, నవంబర్ 30 : తెలంగాణ బిడ్డలను కాంగ్రెస్ పార్టీ బలితీసుకుందని, రాష్ట్ర ఏర్పాటుకు అమరవీరుల త్యాగం వెలకట్టలేనిదని, వారికి సమాజం ఎంతో రుణపడి ఉంటుందని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. కేసీఆర్ దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ అమర వీరులకు నివాళులర్పిస్తూ ఆదివారం నకలగుట్టలోని కాళోజీ విగ్రహం నుంచి అదాలత్ జంక్షన్‌లోని అమర వీరుల స్తూపం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
అనంతరం స్తూపానికి పూల మాల వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్బంగా దాస్యం మాట్లాడుతూ కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షను తకువ చేసే కుట్రను కాంగ్రెస్ చేస్తున్నదని ఆరోపించారు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతో చావు నోట్లో తలపెట్టి స్వరాష్ట్రాన్ని సాధించిన నాయకుడిపై బురద జల్లే ప్ర యత్నం చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు ప్రజలే గుణపా ఠం చెబుతారన్నారు. తెలంగాణ ద్రోహి కాంగ్రెస్ అని, 60 ఏండ్ల గోస, వెనుకబాటుకు కారణం ఆ పార్టీనేనన్నారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిచిందన్నారు.
420 హామీలు, 6 గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్ల పాలనలో అన్నివర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతున్నదన్నారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, చింతం సదానందం, కార్పొరేటర్ సంకు నర్సింగరావు, నాయకు లు పులి రజినీకాంత్, నయీముద్దీన్, పోలపల్లి రామ్మూర్తి, సదాంత్, రాకేశ్‌యాదవ్, ప్రశాంత్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

