ఖానాపురం, మార్చి 3: పాకాల అభయారణ్యం అందమైన పక్షులకు నెలవుగా మారింది. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఔల్స్ ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడ పక్షుల ఫొటోలు సేకరించారు. ఇండియన్ ప్యారడైజ్ ఫ్లైకేచర్ (మేల్, ఫిమేల్), బ్యాక్ న్యాప్‌డ్ మోనార్క్, వైట్ రంపుడ్ షమా, జెర్డాన్స్ లీఫ్బర్డ్ వంటివి గుర్తించారు.
పాకాల అభయారణ్యంలో 145 రకాల పక్షులు, 45 రకాల అటవీ జం తువులు ఉన్నాయని, వీటితోపాటు ఏటా వలస పక్షులు సీజనల్‌గా వస్తుంటాయని సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగేశ్వర్రావు తెలిపారు. వన్య సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని పేర్కొన్నారు.