Hanumakonda | ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రారంభం
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ కోర్సులలో అడ్మిషన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది.
హనుమకొండ చౌరస్తా, జూలై 1: రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ కోర్సులలో అడ్మిషన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. ఇంజినీరింగ్ కోర్సులలో ప్రవేశాల కోసం వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్, ఆర్ట్స్ కాలేజీలో కౌన్సెలింగ్ ప్రారంభించారు. ఉదయం నుంచే అభ్యర్థులు భారీ సంఖ్యలో హాజరై, మొత్తం 480 మంది అభ్యర్థులు మొదటిరోజు నమోదు చేసుకున్నారు.
ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ క్రమబద్ధంగా, సజావుగా కొనసాగిందని పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డాక్టర్ బైరి ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ బైరి ప్రభాకర్ టీజీఎప్‌సెట్(ఎంపీసీ స్ట్రీమ్) కౌన్సిలింగ్ లో పాల్గొన్న అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు సమయపాలనతో, అవసరమైన ధృవపత్రాలతో ముందుగా హాజరై తమ లక్ష్యాలను సాధించాలన్నారు. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ https://tgeapcet.nic.in ఈ ప్రక్రియలో సిస్టమ్ అడ్మిన్‌గా ఎస్.రవీందర్ వ్యవహరించగా, ఏ.శ్రీనాథ్, బి.ఎల్లస్వామి చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్స్‌గా ఉన్నారు.
కౌన్సిలింగ్ ముఖ్యమైన తేదీలు..
ప్రథమ దశ ఆన్ లైన్ సమాచారం నమోదు, ఫీజు చెల్లింపు & స్లాట్ బుకింగ్: 28-06-2025 నుండి 07-07-2025
సర్టిఫికెట్ వెరిఫికేషన్: 01-07-2025 నుండి 08-07-2025 ఆప్షన్ల ఎంపిక: 06-07-2025 నుండి 10-07-2025
ఆప్షన్ల ఫ్రీజింగ్ (తదుపరి మార్పులుకు ముగింపు): 10-07-2025 మాక్ సీటు కేటాయింపు: 13-07-2025 లోపు
ఆప్షన్ల మార్పు (ఆఖరి తుదిసారి): 14-07-2025 నుండి 15-07-2025 తాత్కాలిక సీటు కేటాయింపు: 18-07-2025 లోపు ఫీజు చెల్లింపు ,సెల్ఫ్ రిపోర్టింగ్: 18-07-2025 నుండి 22-07-2025
రెండవ దశ
స్లాట్ బుకింగ్ & ఫీజు చెల్లింపు (మొదటి దశలో పాల్గొననివారికి ): 25-07-2025 సర్టిఫికెట్ వెరిఫికేషన్: 26-07-2025 ఆప్షన్ల ఎంపిక: 26-07-2025 నుండి 27-07-2025 తాత్కాలిక సీటు కేటాయింపు: 30-07-2025 లోపు ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్: 30-07-2025 నుండి 01-08-2025 కాలేజీకి భౌతికంగా హాజరు కావాలి: 31-07-2025 నుండి 02-08-2025
చివరి దశ (ఫైనల్ ఫేజ్) స్లాట్ బుకింగ్, ఫీజు చెల్లింపు: 05-08-2025 సర్టిఫికెట్ వెరిఫికేషన్: 06-08-2025 ఆప్షన్ల ఎంపిక: 06-08-2025 నుండి 07-08-2025 తాత్కాలిక సీటు కేటాయింపు: 10-08-2025 లోపు ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్: 10-08-2025 నుండి 12-08-2025 కాలేజీకి హాజరు (బ్రాంచ్/కాలేజీ మార్పు ఉన్నవారికి): 11-08-2025 నుండి 13-08-2025
ఇంటర్నల్ స్లైడింగ్
స్లైడింగ్ కోసం ఆప్షన్ల ఎంపిక: 18-08-2025 నుండి 19-08-2025 తాత్కాలిక కేటాయింపు: 22-08-2025 లోపు బ్రాంచ్ మారినవారు సెల్ఫ్ రిపోర్ట్ & ప్రింట్ తీసుకోవాలి: 22-08-2025 నుండి 23-08-2025
స్పాట్ అడ్మిషన్లు వివరాలు అధికారిక వెబ్ సైట్ లో: 23-08-2025 లోపు అందుబాటులో ఉంటాయని పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ ప్రభాకర్ తెలిపారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

