కొత్త డిజైన్‌తో గోదావరి కరకట్ట
గోదావరి కరకట్టను కొత్త డిజైన్‌తో నిర్మించనున్నట్లు పంచాయతీ రాజ్, గ్రామీణ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం సమీపంలో దెబ్బతిన్న గోదావరి కరకట్టను శుక్రవారం మంత్రి పరిశీలించి,
- జియో ట్యూబ్స్ తరహాలో నిర్మాణం
- పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
- రామన్నగూడెం నుంచి మంగపేట వరకు గోదావరి తీరం పరిశీలన
ఏటూరునాగారం, జూన్ 28 : గోదావరి కరకట్టను కొత్త డిజైన్‌తో నిర్మించనున్నట్లు పంచాయతీ రాజ్, గ్రామీణ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం సమీపంలో దెబ్బతిన్న గోదావరి కరకట్టను శుక్రవారం మంత్రి పరిశీలించి, కట్ట తెగకుండా ఉండేందుకు తీసుకుంటున్న చర్యలను నీటి పారుదలశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గోదావరికి వరద బాగా వచ్చినపుడు రక్షణగా ఉండేలా కరకట్టకు కొత్త డిజైన్‌ను ఆమోదించామని, జియో ట్యూబ్స్ మోడల్లో నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. గతంలో వచ్చిన గోదావరి, జంపన్నవాగు వరదలను దృష్టిలో పెట్టుకుని అధికారులను అప్రమత్తం చేస్తున్నట్లు చెప్పారు. కరకట్ట షట్టర్లను కూడా మరమ్మతు చేస్తామన్నారు. వెంటనే పనులు ప్రారంభించేలా నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించనున్నట్లు తెలిపారు. రామన్నగూడెం, రాంనగర్ మీదుగా కమలాపురం వరకు గోదావరి తీర ప్రాంతాన్ని పరిశీలిస్తూ మంగపేట మండలానికి వెళ్లారు.
మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దాలి
ఏటూరునాగారంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలను రాష్ట్రంలోనే మోడల్‌గా తీర్చిదిద్దాలని, ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేయాలని మంత్రి సీతక్క సూచించా రు. కలెక్టర్ టీఎస్ దివాకర, అదనపు కలెక్టర్ శ్రీజ, ఐటీడీఏ పీవో చిత్రామిశ్రాతో కలిసి ఆశ్రమ పాఠశాలను సందర్శించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా సీతక్క పాఠశాలలో భోజన, వసతి సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. గిరిజన సంక్షేమశాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సీఎం ఆమోదం తెలిపారన్నారు. అనంతరం మండల కేంద్రంలోని రామాలయం సెంటర్లో ఉన్న పల్లె దవాఖానను సందర్శించి అక్కడ అందుతున్న సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్
గోదావరి వరద ముంపు నుంచి గ్రామాలను కాపాడేందు కు జియో ట్యూబ్స్ తరహాలో కరకట్ట నిర్మించనున్న నేపథ్యం లో నీటి పారుదలశాఖ అధికారులు ఐటీడీఏ కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించగా మంత్రి సీతక్క హాజరయ్యారు. రామన్నగూడెం నుంచి మంగపేట మండల కేంద్రం వరకు సుమారు 7.5 కిలోమీటర్ల పొడవున కొత్త డిజైన్‌ను ఎక్కడెక్కడ నిర్మించాల్సి ఉంటుందో చర్చించారు.
రైతును రాజు చేయడమే లక్ష్యం
మంగపేట : రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. మంగపేట మండల కేంద్రంలో రూ. 1.28 కోట్లతో నిర్మించిన సహకార వ్యవసాయ సంఘం నూతన భవనాన్ని మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే ఎలాంటి మంచి పనైనా ముహూర్తం లేకుండా ప్రారంభిస్తానన్నారు. త్వరలోనే మండల కేంద్రంలో కస్తూర్బా హాస్టల్‌ను ప్రారంభిస్తామన్నారు. అనంతరం కమలాపురంలోని బిల్ట్ కర్మాగారాన్ని సందర్శించారు. వీలైనంత త్వరలో ఫ్యాక్టరీని ప్రారంభించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఏఎస్పీ మహేశ్ గీతే, నీటి పారుదలశాఖ సీఈ అజయ్ కుమార్, ఎస్ఈ మోహన్‌రావు, ఈఈ జగదీశ్వర్, ఏపీవో వసంతరావు, డీడీ పోచం, గిరిజన సంక్షేమశాఖ ఈఈ వీరభద్రం, ఏటీడీవో దేశీరాం, టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్రావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, పీఏసీఎస్ చైర్మన్ తోట రమేశ్, నాయకులు జయరాం రెడ్డి, వల్లపల్లి శివయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

