సొంత గూటికి వస్తున్న వలస పక్షులు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరి చూపు బీఆర్ఎస్ వైపే ఉన్నది. అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి నామినేషన్ల పర్వంలోనే పల్లెల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన గులాబీ శ్రేణులు అక్కడ జరిగే అంతర్గత కుమ్ములాటలు, పాత నాయకత్వ పోరులో ఇమడలేక బయటకు వస్తున్నారు.
- కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి చేరుతున్న శ్రేణులు
- హస్తంకు పల్లెల్లో ఆదరణ కరువు
- అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాటలు
- ఇమడలేకపోతున్న గులాబీ నాయకులు
- ఎక్కడికక్కడ రెబల్స్‌గా నామినేషన్లు
- జోష్‌లో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు
జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరి చూపు బీఆర్ఎస్ వైపే ఉన్నది. అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి నామినేషన్ల పర్వంలోనే పల్లెల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన గులాబీ శ్రేణులు అక్కడ జరిగే అంతర్గత కుమ్ములాటలు, పాత నాయకత్వ పోరులో ఇమడలేక బయటకు వస్తున్నారు. మరికొంతమంది కాంగ్రెస్‌లోనే ఉంటూ రెబల్స్‌గా నామినేషన్లు వేస్తున్నారు. అలాగే రాష్ట్ర సర్కారుపై అసంతృప్తితో కాంగ్రెస్ కార్యకర్తలు, ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్ తలుపుతడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని, సంక్షేమ ఫలాలు అనుభవించామని పల్లె ప్రజలు ఆ పార్టీ అభ్యర్థులకే పట్టం కడతామని చెప్తుండడం కనిపిస్తున్నది. ఈ క్రమంలో బీఆర్ఎస్ సమావేశాలకు ప్రజలు, గులాబీ దండు తరలివస్తుండడంతో ఆ పార్టీలో జోష్ కనిపిస్తున్నది.
భూపాలపల్లి నియోజకవర్గంలో అధికార పార్టీ నుంచి రెబల్స్ పోరు పెరిగిపోతున్నది. దాదా పు ప్రతి స్థానం నుంచి ముగ్గురి చొప్పున ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నామినేషన్ వేయిస్తున్నారని, ఇందులో నుంచి ఎవరిని బుజ్జగిస్తారో.. ఎవరికి అవకాశం ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొందని ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు వాపోతున్నారు. ముగ్గురు కూర్చుని మీరే డిసైడ్ చేసుకోండని కొందరికి చెప్తున్నట్లు సమాచారం. నామినేషన్ వేశాక అవకాశం కల్పించకుండా ఉపసంహారించుకోమంటే తగ్గేది లేదని, రెబల్‌గానైనా బరిలో ఉంటామని కొందరు తమ పార్టీ ఉన్నత స్థాయి నేతలతోనే చెబుతున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే సొంత మండలంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఒక నేత గణపురంలో రెబల్‌గా నా మినేషన్ వేని తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అలాగే మరికొందరు అతని బాటలో ఉన్న ట్లు తెలుస్తున్నది.
బీఆర్ఎస్లో జోష్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం బీఆర్ఎస్లో జోష్ నింపుతున్నది. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నుంచి సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నారు. అధికార పార్టీ నుంచి బెదిరింపులు వస్తున్నా భయపడకుండా ముందుకు సాగుతున్నారు. పోటీ ఎక్కువవుతున్నా అధిష్టానం ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నా రు. పార్టీ అధిష్టానం, నేతలు ఎక్కడ సమా వేశాలు ఏర్పాటు చేసినా అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేస్తున్నారు. భవిష్యత్ మాదే అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని, కాంగ్రెస్ చేసిన మోసాలను వివరిస్తామని, పింఛన్, రైతు భరోసా, రైతు బంధు, సబ్సిడీ గ్యాస్ తదితర హామీల అమలుపై నిలదీస్తామని గులాబీ కార్యకర్తలు స్పష్టం చేస్తున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

