ధాన్యం కొనుగోళ్లను వేగవంతంచేయాలి
యాసంగి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని క లెక్టర్ భవేశ్‌మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, తూనికలు కొలతలు, పౌరసరరాల శాఖల అధికారులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
- 15 రోజుల్లో వడ్ల కాంటాలు పూర్తి చేయాలి
- భూపాలపల్లి కలెక్టర్ భవేశ్‌మిశ్రా
భూపాలపల్లి రూరల్, మే 16 : యాసంగి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని క లెక్టర్ భవేశ్‌మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, తూనికలు కొలతలు, పౌరసరరాల శాఖల అధికారులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 117 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు 16,500 మెట్రిక్‌టన్నుల వడ్లు కొనుగోలు చేసినట్లు చెప్పారు. అకాల వర్షాలతో ధాన్యం తడువకుండా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రక్షణ చర్యలు చేపట్టాలన్నారు.
రెండు రోజుల్లో ఓపీఎంఎస్లో డాటా ఎంట్రీ పూర్తి చేయాలని ఆదేశించారు. రాబోయే 15 రోజు లు కీలకమని, వ్యవసాయ శాఖ అధికారుల అంచనా ప్రకారం ఇంకా సుమారు 45 వేల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు కేం ద్రాలకు రావొచ్చని, అ ప్రమత్తంగా ఉండి కొనుగోలు చేయాలని సూ చించారు. ధాన్యం తడవకుండా రైతులకు అవగాహన కల్పించాలన్నా రు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వ ర్లు, జిల్లా వ్యవసాయ అ ధికారి విజయభాస్కర్, డీఆర్డీవో నరేశ్, పౌరసరఫరాల అధికారి నర్సింగరావు, సివిల్ సైప్లె డీఎం రాఘవేందర్, తూనికలు కొలతల శాఖ అధికారి శ్రీలత, మార్కెటింగ్ శాఖ అధికారి కనక శేఖర్, కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలు, రైస్ మిల్లర్ల సంఘం సభ్యులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
స్కూలు దుస్తులు సిద్ధం చేయాలి
కాటారం : విద్యా సంస్థల పునఃప్రారంభంలోగా యూనిఫాంలు సిద్ధం చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులకు సూచించారు. కాటారం మండలకేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో జీవన జ్యోతి మండల సమాఖ్య మహిళా సంఘం సభ్యులు విద్యార్థుల యూనిఫాంల కుట్టు ప్రక్రియను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాంలు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. మండలంలోని మొత్తం 49 మండల పాఠశాలలకు 901 మంది బాలురు, 988 మంది బాలికలతో కలిపి 1889 మంది విద్యార్థులకు 3,878 యూనిఫాంల తయారీకి జీవన జ్యోతి మండల సమాఖ్య సభ్యులకు ఇచ్చినట్లు చెప్పారు.
యూనిఫాంలను జూన్ 10లోగా అందించాలని 12 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతాయన్నారు. జూన్ 10లోపు బాల, బాలికలకు యూనిఫాంలను అందించనున్నట్లు చెప్పారు. సీజన్ పూర్తవగానే మహిళా సభ్యులకు చేయూత కల్పిస్తామన్నారు. యూనిఫాంల తయారీ విధానాన్ని బట్టి నాణ్యతను పరిశీలించి అభినందించారు. అనంతరం అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ మండలంలోని పోతుల్వాయి, బయ్యారం గ్రామాల్లో ప్రైమరీ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో నరేశ్, తసీల్దార్ నాగరాజు, ఎంపీడీవో బాబు, ఎంపీవో ఉపేంద్రయ్య, పీఆర్ డీఈ సాయిలు, కుట్టు శిక్షకురాలు వనిత పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

