వరంగల్ : జిల్లాలోని మామునూరు పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులను జిల్లా కలెక్టర్ బి. గోపి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే వేల ఉద్యోగాలను భర్తీ చేయనుందన్నారు. నిరుద్యోగులు సమయాన్ని వృథా చేసుకోకుండా ఉచిత శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, మామునూరు పీటీసీ ప్రిన్సిపల్ పూజ, పోలీస్ అధికారులు, టీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.