సీఎం రేవంత్ పర్యటన రేపటికి వాయిదా
సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్ నగర పర్యటన శనివారానికి వాయిదా పడింది. శుక్రవారం వివిధ అభివృద్ధి పనుల పరిశీలన, సమీక్ష నిర్వహించాల్సి ఉండగా ఆ మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
హనుమకొండ, జూన్ 27 : సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్ నగర పర్యటన శనివారానికి వాయిదా పడింది. శుక్రవారం వివిధ అభివృద్ధి పనుల పరిశీలన, సమీక్ష నిర్వహించాల్సి ఉండగా ఆ మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. టూర్ షెడ్యూల్ కూడా ఖరారు కాగా, చివరి నిమిషంలో వాయిదా పడింది. తొలుత విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పరిశీలన, హనుమకొండ కలెక్టరేట్ మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం, జీడబ్ల్యూఎంసీ పరిధిలోని అభివృద్ధి పనులు, సమస్యలపై సమీక్ష నిర్వహించాల్సి ఉంది. ఈ కార్యక్రమాలన్నీ ఈ నెల 29కి వాయిదా పడ్డాయి.
పార్కులో కలెక్టర్, సీపీ ఏర్పాట్ల పరిశీలన
గీసుగొండ : సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో గురువారం సాయంత్రం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును వరంగల్ కలెక్టర్ సత్య శారదాదేవి, సీపీ అంబర్ కిశోర్‌ఝా, సీఎం వ్యక్తిగత భద్రతా సిబ్బందితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా హెలీప్యాడ్‌తో పాటు ఫొటో ఎగ్జిబిషన్ గ్యాలరీ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వారి వెంట అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీవో దత్తు, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ సంతోష్‌కుమార్, డీసీపీ రవీందర్, డీఎంహెచ్‌వో వెంకటరమణ, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

