వరంగల్ ఉమ్మడి జిల్లా బరిలో వీరే.. బీఆర్ఎస్ అభ్యర్థుల బయోడేటా..
అందరికంటే ముందే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను ప్రకటించి ప్రతిపక్షాలు బిత్తరపోయేలా చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలకు గాను 9మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మరోసారి అవకాశం ఇచ్చారు.
- సీనియారిటీ, సమర్థత, సమతూకం
నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 21 : అందరికంటే ముందే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను ప్రకటించి ప్రతిపక్షాలు బిత్తరపోయేలా చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలకు గాను 9మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మరోసారి అవకాశం ఇచ్చారు. సీనియారిటీ, సమర్థతకు ప్రాధాన్యమిస్తూ ఎంపికలో సమతూకం పాటించారు. పాలకుర్తి నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వరంగల్ పశ్చిమం నుంచి బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, వర్ధన్నపేట నుంచి బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్, పరకాల నుంచి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నర్సంపేట నుంచి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, డోర్నకల్ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్, మహబూబాబాద్ నుంచి ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, భూపాలపల్లి నుంచి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్, ఇల్లందు నుంచి ఎమ్మెల్యే హరిప్రియానాయక్‌కు మరోసారి సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారు. స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి ఈ సారి మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ములుగు నుంచి ఆదివాసీ మహిళ, జడ్పీ అధ్యక్షురాలు బడే నాగజ్యోతి, హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, భద్రాచలం నుంచి తెల్లం వెంకటరావు, మంథని నుంచి పెద్దపల్లి జడ్పీ అధ్యక్షుడు పుట్ట మధుకు టికెట్లు ఇచ్చారు. ఈ సందర్భంగా బరిలో నిలిచిన ఉమ్మడి జిల్లాకు చెందినవారి రాజకీయ నేపథ్యం మీకోసం..
స్టేషన్‌ఘన్‌పూర్ (ఎస్సీ)
పూర్తి పేరు : కడియం శ్రీహరి
తల్లిదండ్రులు : వెంకటమ్మ-లక్ష్మీనరసయ్య
పుట్టిన తేదీ : జూలై 8, 1952
స్వస్థలం : పర్వతగిరి, వరంగల్ జిల్లా
విద్యార్హతలు : పీజీ-కెమిస్ట్రీ (ఉస్మానియా యూనివర్సిటీ)
భార్య : వినయరాణి
పిల్లలు : ముగ్గురు కుమార్తెలు(డాక్టర్ కావ్య, దివ్య, రమ్య)
రాజకీయ ప్రవేశం :
- 1987 ఫిబ్రవరిలో టీడీపీలో చేరిక.
- 1994లో తొలిసారి స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ కేబినెట్లో మారెట్ గిడ్డంగుల శాఖ మంత్రిగా పనిచేశారు.
- 1999 సాధారణ, 2008 ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా విజయం. చంద్రబాబు ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ, విద్యాశాఖతో పాటు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పదవులు చేపట్టారు.
- 2013లో టీఆర్ఎస్లో చేరిక, పొలిట్‌బ్యూరో సభ్యులుగా, మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా పనిచేశారు.
- 2014లో వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్యపై 3,92, 574 ఓట్ల భారీ మెజార్టీతో ఎంపీగా ఎన్నికయ్యారు.
- 2015లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నిక, జనవరి 25న ఉప ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా పదవులు చేపట్టారు.
- 2021 నవంబర్ 16 నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.
వరంగల్ తూర్పు (జనరల్)
పేరు : నన్నపునేని నరేందర్
పుట్టిన తేదీ : ఆగస్టు 5, 1972
విద్యార్హత : ఇంటర్మీడియట్
తల్లిదండ్రులు : కాంతమ్మ-నర్సింహమూర్తి
భార్య : మెహర్ వాణి
కుమారులు : లోకేష్ పటేల్, మన్‌ప్రీత్ పటేల్
స్వస్థలం : వరంగల్
రాజకీయ ప్రస్థానం :
- 1995లో టీడీపీలో చేరిక. కల్పలత సూపర్‌బజార్ డైరెక్టర్‌గా ఎన్నిక.
- 1997లో టీడీపీ డివిజన్ కార్యదర్శిగా, డివిజన్ అధ్యక్షుడిగా పనిచేశారు.
- 2004లో టీడీపీ జిల్లా కార్యవర్గసభ్యుడిగా ఎన్నిక.
- 2005లో గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ కార్పొరేటర్‌గా ఎన్నిక.
- 2008లో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నిక.
- 2009లో టీఆర్ఎస్లో చేరిక.
- 2014లో టీఆర్ఎస్ గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడిగా ఎన్నిక.
- 2016లో గ్రేటర్ వరంగల్ నగర మేయర్‌గా ఎన్నిక.
- 2018లో వరంగల్ తూర్పు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్రపై 28,782 ఓట్ల మెజారిటీతో గెలుపు.
ములుగు (ఎస్టీ)
పూర్తి పేరు : బడే నాగజ్యోతి
పుట్టిన తేదీ : 05-01-1994
తల్లిదండ్రులు : రాజేశ్వరి-నాగేశ్వర్రావు
స్వస్థలం : కాల్వపల్లి, తాడ్వాయి మండలం, ములుగు జిల్లా
విద్యార్హతలు : ఎంఎస్సీ(బాటనీ), బీఈడీ
భర్త : ఎట్టి జగదీశ్
పిల్లలు : ఒక కుమారుడు (గహన్ శివన్ ధృవన్)
రాజకీయ నేపథ్యం :
- 2019లో కాల్వపల్లి సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థిగా గెలుపు
- 2019లో జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా తాడ్వాయి జడ్పీటీసీగా గెలుపు
- 2019 నుంచి 2023 జూన్ 18వ వరకు ములుగు జడ్పీ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు.
- 2023 జూన్ 19 నుంచి జడ్పీచైర్‌పర్సన్‌గా ఉన్నారు.
నర్సంపేట (జనరల్)
పూర్తి పేరు : పెద్ది సుదర్శన్‌రెడ్డి
పుట్టిన తేదీ : ఆగస్టు 6, 1974
తల్లిదండ్రులు : అమృతమ్మ-రాజిరెడ్డి
భార్య : స్వప్న
కొడుకు : నిదర్శన్‌రెడ్డి
కూతురు : ధర్మిష్ఠరెడ్డి
చదువు : ఇంటర్మీడియట్
స్వస్థలం : నల్లబెల్లి, వరంగల్ జిల్లా
రాజకీయ ప్రస్థానం :
- నల్లబెల్లి మండల యూత్ అధ్యక్షుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి దుగ్గొండి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నిక.
- 2001లో టీఆర్ఎస్లో చేరిక.
- రైతు నాగలి గుర్తుపై నల్లబెల్లి జడ్పీటీసీ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం. జడ్పీలో ఫ్లోర్‌లీడర్‌గా ఎన్నిక.
- 2004 డిసెంబర్లో టీఆర్ఎస్ జిల్లా కన్వీనర్‌గా ఎన్నిక.
- 2005 చివర్లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక.
- వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా 8 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీకి, వరంగల్ జిల్లా ఉద్యమానికి ప్రాతినిధ్యం.
- 2006 నుంచి 2014 వరకు జిల్లా పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యుడిగా పనిచేస్తూ కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా, ఉద్యమనేతగా అనతికాలంలోనే రాష్ట్రస్థాయిలో రాజకీయ గుర్తింపు.
- 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా నర్సంపేట నుంచి పోటీచేసి స్వతంత్ర అభ్యర్థి దొంతి మాధవరెడ్డి చేతిలో 18,376 ఓట్ల తేడాతో ఓటమి.
- రెండు పర్యాయాలు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు.
- 2018 ఎన్నికల్లో సమీప కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డిపై 16,949 ఓట్ల మెజారిటీతో గెలుపు.
డోర్నకల్(ఎస్టీ)
పేరు : ధరంసోత్ రెడ్యానాయక్
తండ్రి : రామునాయక్
పుట్టిన తేదీ : ఆగస్టు 20, 1952
విద్యార్హతలు : బీఏ
భార్య : లక్ష్మి
స్వస్థలం : ఉగ్గంపల్లి(మంచ్యాతండా), చిన్నగూడూరు మండలం, మహబూబాబాద్ జిల్లా
సంతానం : ఇద్దరు కుమారులు, కుమార్తె(మాలోత్ కవిత, మహబూబాబాద్ ఎంపీ)
రాజకీయ ప్రస్థానం :
- ఉగ్గంపల్లి సర్పంచ్‌గా రాజకీయ జీవితం ప్రారంభించారు. పంచాయతీ సమితి అధ్యక్షుడిగా, మండల పరిషత్ అధ్యక్షుడిగా పనిచేశారు.
- 1979లో కేసముద్రం మార్కెట్ కమిటీ సభ్యుడిగా 1989 సర్పంచ్ సమితి అధ్యక్షుడిగా, ఎంపీపీగా పనిచేశారు.
- 1989 నుంచి 2004 వరకు వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రిగా పనిచేశారు.
- 2009లో ఓటమి, 2014 నుంచి ఎమ్మెల్యేగా గెలుపు
- 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా 17,281ఓట్ల మెజార్టితో గెలుపు.
మహబూబాబాద్ (ఎస్టీ)
పూర్తి పేరు : బానోత్ శంకర్ నాయక్
పుట్టిన తేదీ : 20-05-1965
స్వస్థలం : మడిపల్లి, వరంగల్ జిల్లా
విద్యార్హతలు : బీటెక్(ఆర్ఈసీ-వరంగల్), ఎంబీఏ(కె.యూ)
తల్లితండ్రులు : బాజబాయి, కేవనాయక్
భార్య : డాక్టర్ సీతామహాలక్ష్మి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎంజీఎం/కేఎంసీ
పిల్లలు : తేజస్వి, సూర్యచంద్ర
రాజకీయ నేపథ్యం :
- 2009లో పీఆర్పీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి.
- 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపు.
సామాజిక సేవ : - 1995లో గిరిజన విద్యావంతులతో ఆంధ్రప్రదేశ్ గిరిజన విద్యావంతుల సంఘం స్థాపించి మారుమూల గిరిజన తండాల్లో విస్తృతంగా పర్యటించి సమస్యల పరిషారానికి కృషిచేశారు.
- 2001లో హనుమకొండలో ఆర్థికంగా వెనుకబడిన 21 నిరుపేద కుటుంబాలకు ఇండ్లు నిర్మించి ఇచ్చారు.
వర్ధన్నపేట (ఎస్సీ)
పేరు : అరూరి రమేశ్
పుట్టిన తేదీ : 04-04-1967
విద్యార్హతలు : ఎంఏ(సోషియాలజీ), ఎల్ఎల్బీ
తల్లిదండ్రులు : వెంకటమ్మ-గట్టుమల్లు
భార్య : కవిత(ఎంఏ, ఎల్ఎల్బీ)
పిల్లలు : విశాల్, అక్షిత
స్వస్థలం : ఉప్పుగల్లు, మం.జఫర్‌గఢ్, జిల్లా జనగామ.
రాజకీయ నేపథ్యం :
- 1994లో టీడీపీ సమన్వయ కమిటీ సభ్యునిగా, 1987లో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు.
- 2009లో పీఆర్పీ నుంచి స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు.
- 2014లో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 86,349 ఓట్ల మెజార్టీతో సమీప కాంగ్రెస్ అభ్యర్థి కొండేటి శ్రీధర్‌పై విజయం సాధించారు.
- 2018 ఎన్నికల్లో తన సమీప అభ్యర్థి పగిడిపాటి దేవయ్య(బీజేపీ)పై 99,240 ఓట్ల మెజార్టీతో రెండోసారి విజయం సాధించారు.
పరకాల (జనరల్)
పేరు : చల్లా ధర్మారెడి
పుట్టిన తేదీ : 08-09-1968
తల్లిదండ్రులు : సమ్మక్క-మల్లారెడ్డి
భార్య : జ్యోతి
సంతానం : ఇద్దరు కూతుళ్లు(మానసరెడ్డి, జాహ్నవిరెడ్డి)
విద్యార్హతలు : బీఏ
స్వస్థలం : ప్రగతిసింగారం, శాయంపేట మండలం, హనుమకొండ జిల్లా
రాజకీయ నేపథ్యం :
- 2012 ఉప ఎన్నికలో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
- 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపు.
- 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖపై విజయం, వరుసగా రెండోసారి విజయం.
భూపాలపల్లి (జనరల్)
పేరు : గండ్ర వెంకటరమణారెడ్డి
విద్యార్హతలు : డిప్లొమా(ఎల్సీఈ)
పుట్టిన తేదీ : మే 5, 1966
స్వస్థలం : చెల్పూర్, గణపురం మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
తల్లితండ్రులు: సుశీల-మోహన్‌రెడ్డి
భార్య : జ్యోతి(జడ్పీ చైర్పర్సన్-వరంగల్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా
అధ్యక్షురాలు- జయశంకర్ భూపాలపల్లి)
పిల్లలు : గౌతమ్‌రెడ్డి(గండ్ర మోహన్‌రెడ్డి
మెమోరియల్ ట్రస్టు జనరల్
సెక్రటరీ), ప్రియాంకరెడ్డి.
రాజకీయ నేపథ్యం :
- 1986లో రాజకీయ ప్రవేశం.
- 2007 నుంచి 2009 వరకు ఎమ్మెల్సీ.
- 2009 నుంచి 2014 వరకు భూపాలపల్లి ఎమ్మెల్యే.
- 2018 ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపు.
వరంగల్ పశ్చిమ (జనరల్)
పేరు : దాస్యం వినయభాస్కర్
పుట్టిన తేదీ : 22 నవంబర్, 1969
విద్యార్హతలు : ఎంఏ పొలిటికల్ సైన్స్
తల్లిదండ్రులు : శిలోత్రీదేవి-రంగయ్య
భార్య : రేవతి భాస్కర్
పిల్లలు : కృషికా భాస్కర్, కృష్ణవ్ భాస్కర్
స్వస్థలం : వడ్డేపల్లి, హనుమకొండ
రాజకీయ నేపథ్యం :
- 1999లో హనుమకొండ ఎమ్మెల్యేగా పోటీ చేశారు (స్వతంత్ర)
- 2004లో హనుమకొండ (స్వతంత్ర) ఎమ్మెల్యేగా పోటీ చేశారు.
- 2005లో టీఆర్ఎస్ పార్టీ వరంగల్ అర్బన్ అధ్యక్షుడు.
- 2005లో జీడబ్ల్యూఎంసీ వరంగల్ కార్పొరేటర్‌గా ఎన్నిక.
- 2009లో వరంగల్ పశ్చిమ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక.
- 2010 ఉప ఎన్నికలోనూ గెలుపు.
- 2014, 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక
- 2015లో సీఎంవోలో పార్లమెంటరీ సెక్రటరీ ఇన్చార్జిగా పనిచేశారు.
- 2019లో ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియామకం.
- 2022 హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు.
పాలకుర్తి (జనరల్)
పూర్తి పేరు : ఎర్రబెల్లి దయాకర్‌రావు
పుట్టిన తేదీ : 04-07-1956
విద్యార్హత : ఇంటర్మీడియట్
తల్లిదండ్రులు : ఆదిలక్ష్మి-జగన్నాథరావు
భార్య : ఉషారాణి
పిల్లలు : ప్రేమ్‌చందర్‌రావు, ప్రతిమారావు
స్వస్థలం : పర్వతగిరి, వరంగల్ జిల్లా
రాజకీయ ప్రస్థానం :
- 1982లో టీడీపీలో చేరిక
- 1987లో కల్లెడ సొసైటీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై వరంగల్ డీసీసీబీ చైర్మన్‌గా బాధ్యతలు.
- 1994 సాధారణ ఎన్నికల్లో తొలిసారి వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపు.
- 1999, 2001, 2004లో వరుసగా వర్ధన్నపేట శాసనసభ్యులుగా విజయం.
- 2008 వరంగల్ పార్లమెంట్‌కు జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా గెలుపు.
- 2009లో పునర్విభజనలో భాగంగా పాలకుర్తి నుంచి పోటీచేసి 4వసారి గెలుపు.
- 2014లో 5వ సారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపు
- 2016లో ఫిబ్రవరి 25న టీఆర్ఎస్లో చేరిక.
- 2018లో పాలకుర్తి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి 53,062 ఓట్ల భారీ మెజార్టీతో 6వ సారి ఎమ్మెల్యేగా గెలిచి డబుల్ హ్యాట్రిక్ కైవసం.
- 2019 ఫిబ్రవరి 19న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రిగా బాధ్యతలు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్‌వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
Farmers | పంటలు ఎండిపోతున్నా పట్టింపు లేదా.. అన్నదాతల ఆగ్రహం
Gang Rape | మహిళపైనా ‘గ్యాంగ్ రేప్’ కేసు పెట్టొచ్చు.. ఢిల్లీ హైకోర్టు చరిత్రాత్మక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

