హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 9 : అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవినీతి వ్యతిరేక సంస్థ జ్వాల ఆధ్వర్యంలో నిజాయితీ అధికారులకు పౌర సన్మానం నిర్వహించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వేయిస్తంభాల గుడి నుంచి అంబేదర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. హనుమకొండలోని విద్యుత్ శాఖలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న పోడేటి అశోక్, సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం రెవెన్యూ శాఖలో ఏఆర్ఐగా పని చేస్తున్న సీహెచ్ నర్సయ్యను అశ్వాలపై ఊరేగించారు.
పూల వ ర్షం కురిపిస్తూ ఘనంగా స న్మానించారు. జ్వాలా, లోక్ సత్తా సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి లోక్‌సత్తా సంస్థ రాష్ట్ర సలహాదారులు ప్రొఫెసర్ పర్చ కోదండరామారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్వాలా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్ మాట్లాడుతూ అవినీతికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచేలా ఏసీబీ ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరారు.