లింగాల ఘణపురం : అభివృద్ధి ప్రదాత కేసీఆర్ అని, నిత్యం కరువు కాటకాలకు నిలయమైన జనగామ ప్రాంత అభివృద్ధి చెందింది కేసీఆర్ తోనే అని మాజీ ఎంపీపీ చిట్ల జయశ్రీ అన్నారు. మండలంలోని నెల్లుట్లలో ఆమె రజతోత్సవ సభ పోస్టర్లను ఇంటింటికి అంటించి సభ ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జనగామ ప్రాంతం నుండి రైతులు వ్యవసాయాన్ని బందు పెట్టి కూలీలుగా వలసలు పోయేవారన్నారు. కేసీఆర్ వ్యవసాయాన్ని పండగలా చేయడంతో వలసలు పోయిన రైతులంతా తిరిగి గ్రామాల చేరుకొని వ్యవసాయం చేస్తూ నేడు దర్జాగా బతుకుతున్నారన్నారు.
గోదావరి జలాలతో ఈ మండలంలోని చెరువులన్నింటిని నింపి తాగునీటిని సమస్యను తీర్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈనెల 27న ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ సభకు సభకు వేలాదిగా తరలి రావాలన్నారు. పెద్ద ఎత్తున సభకు హాజరై విపక్షాలకు దిమ్మ తిరిగేలా తీర్పు నివ్వాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వెంకటరెడ్డి, తదితరుల నాయకులు పాల్గొన్నారు.