రైతు సదస్సు ప్రాంగణం పరిశీలన
హనుమకొండ హంటర్‌రోడ్డులో ఈ నెల 6న నిర్వహించనున్న రైతు సదస్సును ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఇటీవల హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పేరిట చేసిన మోసాన్ని గుర్తు చేస్తూ, ఈ నెల 6వ తేదీన వరంగల్‌లో సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
హనుమకొండ, మే 1 : హనుమకొండ హంటర్‌రోడ్డులో ఈ నెల 6న నిర్వహించనున్న రైతు సదస్సును ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఇటీవల హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పేరిట చేసిన మోసాన్ని గుర్తు చేస్తూ, ఈ నెల 6వ తేదీన వరంగల్‌లో సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో రైతు సదస్సు నిర్వహించే ప్రాంగణాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్రావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, వాసుదేవరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి, ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతి పరిశీలించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

