కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లపై నిరసనలు
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్లపై జిల్లావ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ర్టానికి బీజేపీ సర్కా ర్ మొండిచేయి చూపిందని కాంగ్రెస్, ఎం సీపీఐ(యూ) నేతలు ఆగ్రహం వ్యక్తం చేశా రు. అలాగే, గురువారం కాంగ్రెస్ ప్రభు త్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో వరంగల్ జిల్లాకు నిధుల కేటాయింపు సరిగా చేయలేదని బీజేపీ నేతలు మండిపడ్డారు.
- తెలంగాణకు బీజేపీ మొండిచేయి చూపిందన్న కాంగ్రెస్
- రాష్ట్ర బడ్జెట్ ప్రతులను దహనం చేసి నిరసన తెలిపిన బీజేపీ నేతలు
- జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్
- ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో కేంద్రం దిష్టిబొమ్మ దహనం
వరంగల్ చౌరస్తా, జూలై 25: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్లపై జిల్లావ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ర్టానికి బీజేపీ సర్కా ర్ మొండిచేయి చూపిందని కాంగ్రెస్, ఎం సీపీఐ(యూ) నేతలు ఆగ్రహం వ్యక్తం చేశా రు. అలాగే, గురువారం కాంగ్రెస్ ప్రభు త్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో వరంగల్ జిల్లాకు నిధుల కేటాయింపు సరిగా చేయలేదని బీజేపీ నేతలు మండిపడ్డారు.
బడ్జెట్లో జిల్లాకు నిధులు ఇవేనా ?
రాష్ట్ర బడ్జెట్లో వరంగల్‌కు సరైన నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ బీజేపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ హెడ్ పోస్టాఫీస్ సెంటర్లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దిష్టిబొమ్మను పోలీసులు లాక్కెళ్లడంలో బడ్జెట్ ప్రతులను కాల్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ పాల్గొని మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతోపాటు బడ్జెట్లో జిల్లాకు కేటాయించిన నిధులు మొ త్తం కలిపి గాడిద గుడ్డును చేతిలో పెట్టారని విమర్శించారు. వరంగల్ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో ఓట్లు పొందిన కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే అసలు నైజాన్ని బయటపెట్టిందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలు, రైతులను మభ్యపెడుతూనే వస్తున్నదని ధ్వజమెత్తారు. ప్రజలను మోసం చేయడంతోపాటు వరికి గిట్టుబాటు ధరపై రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమేనని మెలికపెట్టిందని విమర్శించారు. కల్లబొల్లి మాటలు చెప్పి రుణమాఫీపై రూపాయికో కండీషన్ పెట్టి తప్పించుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ ప్రభుత్వం పండిన పంటలో మూడో వంతు ధాన్యం మాత్రమే కొనుగోలు చేసిందని ఆరోపించారు. వరంగల్‌కు నిధుల కేటాయింపులో మొండిచేయి చూపిన కాంగ్రెస్‌కు ఆ పార్టీ మంత్రు లు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి నిజాయితీ చాటుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా, పట్టణ, నియోజకవర్గ, డివిజన్‌స్థాయి నాయకులు పాల్గొన్నారు.
కేంద్రంపై కాంగ్రెస్ నేతల ధ్వజం
నల్లబెల్లి: బడ్జెట్ కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టానికి మొండిచేయి చూపించిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. ఈ మేరకు మండలకేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలు అనుసురిస్తున్నదని విమర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, ఇస్తారి శేఖర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి చార్ల శివారెడ్డి, నాయకులు కొమురారెడ్డి, కొంరెల్లి, రామ్మూర్తి, ఇంద్రారెడ్డి, బత్తిని మల్లయ్య, పురుషోత్తం, సంపత్‌రెడ్డి, అశోక్, బావుసింగ్, బత్తిని మహేశ్, సుమన్, వెంకట్, మోహన్, నరేశ్, కుమారస్వామి, రవీందర్రావు, ఉపేందర్, రంజిత్, హుసేన్, సంబరాజ్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
వరంగల్ చౌరస్తా : కేంద్రం బడ్జెట్లో తెలంగాణ అభివృద్ధికి కనీస నిధులు కేటాయించకుండా బీజేపీ వివక్ష చూపడాన్ని నిరసిస్తూ ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో వరంగల్ హెడ్‌పోస్టాఫీస్ సెంటర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. రమేశ్ మాట్లాడుతూ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు బడ్జెట్లో ఒక్క రూపాయి కేటాయించకుండా తెలంగాణ ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. తెలంగాణలోని బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు మూకుమ్మ డిగా రాజీనామా చేసి తమ చిత్తశుద్ధిని చాటాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

