పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు.. అధికారులకు భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మిఆదేశం
పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను భూపాలపల్లి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి ఆదేశించారు.
భూపాల్పల్లి రూరల్, ఫిబ్రవరి 24: పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను భూపాలపల్లి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి ఆదేశించారు. ఈ విషయమై ఆమె సోమవారం విద్య, విద్యుత్, వైద్యం, ఆర్టీసీ, తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చేనెల 21 నుండి ఏప్రిల్ నాలుగో తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. పరీక్షలను సాఫీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో 3,449 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని, గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థుల కొరకు రవాణా వసతుల కల్పనకు బస్సులు ఏర్పాటు చేయాలని అన్నారు.
పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని, ఎలాంటి లోటుపాట్లను తావులేకుండా పరీక్షలను సజావుగా నిర్వహించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని విజయలక్ష్మి తెలిపారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లను మూసి వేయించాలని, 144 సెక్షన్ అమలు చేయాలని, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించి, కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరపాలని, ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్షలు జరిగేలా ఆయా శాఖల అధికారులు అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని అన్నారు. ఈ సమావేశంలో డీఈఓ రాజేందర్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, కలెక్ట రేట్ ఏవో ఖాజా మొహినుద్దీన్, ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

