‘డబుల్’ ఇండ్లు కేటాయించాల్సిందే..
‘డబుల్ బెడ్రూం ఇండ్లు మాకు కేటాయించాల్సిందే.. అప్పటి వరకు ఇక్కడి నుంచి కదిలేదు’ అని హనుమకొండలోని అంబేద్కర్ నగర్, జితేందర్‌నగర్‌లోని గుడిసెవాసులు భీష్మించుకు కూర్చున్నారు. ఆదివారం అంబేద్కర్‌నగర్‌లో నిర్మించిన ఇళ్ల వద్దకు చేరుకొని తాళాలు పగులగొట్టి అందులోకి వెళ్లి శుభ్రం చేసుకున్నారు.
- తాళాలు పగలగొట్టి చొరబడిన గుడిసెవాసులు
- పోలీసులతో వాగ్వాదం.. అంబేద్కర్‌నగర్‌లో ఉద్రిక్తత
- తహసీల్దార్ హామీతో ఆందోళన విరమణ
హనుమకొండ, జూలై 21: ‘డబుల్ బెడ్రూం ఇండ్లు మాకు కేటాయించాల్సిందే.. అప్పటి వరకు ఇక్కడి నుంచి కదిలేదు’ అని హనుమకొండలోని అంబేద్కర్ నగర్, జితేందర్‌నగర్‌లోని గుడిసెవాసులు భీష్మించుకు కూర్చున్నారు. ఆదివారం అంబేద్కర్‌నగర్‌లో నిర్మించిన ఇళ్ల వద్దకు చేరుకొని తాళాలు పగులగొట్టి అందులోకి వెళ్లి శుభ్రం చేసుకున్నారు. సుబేదారి పోలీసులు అక్కడికి వెళ్లి గుడిసెవాసులకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు ససేమిరా అన్నారు. దీంతో ఇళ్ల నుంచి వారిని పోలీసులు బలవంతంగా బయటకు పంపించడంతో అక్కడే బైఠాయించి ధర్నా చేపట్టారు.
దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇండ్లు నిర్మించి ఐదేండ్లు అవుతున్నా లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే డబుల్ బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కారు ఇప్పటి వరకు పంపిణీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకుని హనుమకొండ తహసీల్దార్ అక్కడికి చేరుకోగా ఆయనను సైతం నిలదీశారు. చివరకు ఆయన కలెక్టర్ దృష్టికి ఇండ్ల పంపిణీ విషయం తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో గుడిసెవాసులు ఆందోళన విరమించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కాలనీ వాసులు ఎర్ర చంద్రమౌళి, సౌరం రఘు, ఓరుగంటి స్వామి, కోహెడ కృష్ణ, మామిడిపల్లి సుధాకర్, బొచ్చు సరోజన, తేజావత్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

