ఖిలా వరంగల్: తెలంగాణ రాష్ట్రంలోని పెరిక కులస్థుల ( Perika caste ) జనాభా వివరాలు తెలుసుకునేందుకు నిర్వహిస్తున్న మొట్ట మొదటి పెరిక కుటుంబ డిజిటల్ సర్వే ( Digital Survey ) లో ప్రతీ ఒక్కరూ పాల్గొని, తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని పెరిక కుల సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు అల్లం రాజేశ్‌వర్మ ( Allam Rajeshvarma) పిలుపునిచ్చారు.
గురువారం ఖిలావరంగల్ తూర్పుకోటలో నిర్వహించిన పెరిక కుల డిజిటల్ సర్వేలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో ఉన్న పెరిక కులస్థుల జనాభాను ఖచ్చితంగా తెలుసుకోవడానికి రాష్ట్ర అధ్యక్షుడు గటిక విజయ్‌కుమార్ ఈ డిజిటల్ సర్వేను ప్రారంభించారని వెల్లడించారు.
డిజిటల్ సర్వేను కేవలం రెండు నిమిషాలలోపే తమ వ్యక్తిగత సమాచారాన్ని సులభంగా పూర్తి చేయవచ్చని పేర్కొన్నారు. ప్రతీ పెరిక కుటుంబం తమ వివరాలను నమోదు చేయడం ద్వారా సంఘం బలోపేతానికి, ప్రభుత్వాల నుంచి సరైన గుర్తింపు పొందడానికి ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. కార్యక్రమంలో పెరిక కుల నాయకులు, బెడిద వీరన్న, ఏసిరెడ్డి రమేశ్, బిల్ల రాంబాబు, బరుపటి సంపత్ కుమార్, అర్సం రాంబాబు, కందిమల్ల మహేశ్, అంకతి అభిలాష్, వనపర్తి ధర్మరాజు, చుంచు వీరశం, బొలుగొడ్డు సతీశ్, కందిమల్ల భూషణ్ తదితరులు పాల్గొన్నారు.