మురిసిన మువ్వన్నెలు
మువ్వన్నెలు మురిశాయి. ఊరూరా.. వాడవాడలా త్రివర్ణ శోభితమై రెపరెపలాడాయి. 78వ స్వాతంత్య్ర దినోవత్సవ వేడుకలు గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంబురంగా జరిగాయి. హనుమకొండ జిల్లా పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన వేడుకల్లో మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు.
- ఉమ్మడి జిల్లాలో సంబురంగా 78వ స్వాతంత్య్ర వేడుకలు
- ఊరూరా.. వాడవాడలా జాతీయ జెండాల రెపరెపలు
- జెండాలను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యఅతిథులు
- స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం
- ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాల అందజేత..
- జాతీయ సమైక్యతను చాటేలా విద్యార్థుల ప్రదర్శనలు
మువ్వన్నెలు మురిశాయి. ఊరూరా.. వాడవాడలా త్రివర్ణ శోభితమై రెపరెపలాడాయి. 78వ స్వాతంత్య్ర దినోవత్సవ వేడుకలు గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంబురంగా జరిగాయి. హనుమకొండ జిల్లా పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన వేడుకల్లో మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు.

వరంగల్ జిల్లా స్వాతంత్య్ర వేడుకలు ఖిలావరంగల్ ఖుష్‌మహల్ మైదానంలో నిర్వహించగా, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ములుగు జిల్లా తంగేడు మైదానంలో మంత్రి సీతక్క, మహబూబాబాద్ జిల్లా ఎన్టీఆర్ స్టేడియంలో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రూనాయక్, జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీస్టేడియం పరేడ్ గ్రౌండ్స్‌లో ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేదర్ క్రీడా మైదానంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ పొదెం వీరయ్య జాతీయ జెండాలను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

ఆయా జిల్లాల అభివృద్ధి నివేదికలను చదివి వినిపించడంతోపాటు స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. అలాగే ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యఅతిథులు పరిశీలించారు. ఇక దేశభక్తిని, జాతీయ సమైక్యతను చాటేలా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.


– నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 15
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

