బుధవారం 27 జనవరి 2021
Warangal-rural - Jul 28, 2020 , 03:42:49

ముమ్మరంగా వాహనాల తనిఖీలు

ముమ్మరంగా వాహనాల తనిఖీలు

ఏటూరునాగారం, జూలై 27 : మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై పోలీసులు సోమవారం వాహనాల తనిఖీలను చేపట్టారు. ముల్లకట్ట గోదావరి బ్రిడ్జివైపు వెళ్లే వాహనాలను నిలిపి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఏటూరునాగారం వైపు వస్తున్న వాహనాలతో పాటు బ్రిడ్జి వైపు వెళుతున్న వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. నేటి నుంచి మావోయిస్టు అమర వీరుల వారోత్సవాలు ఉండడంతో పోలీసులు వాహనాల తనిఖీలకు శ్రీకారం చుట్టారు. తనిఖీల్లో ఎస్సై శ్రీకాంత్‌ రెడ్డి, సివిల్‌, సీఆర్‌పీఎఫ్‌ పోలీసులు పాల్గొన్నారు. logo