అభివృద్ధి కోసమే కొత్త పంచాయతీలు

- స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టీ రాజయ్య
ధర్మసాగర్,జనవరి 3: అభివృద్ధి కోసమే నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసినట్లు మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మె ల్యే రాజయ్య అన్నా రు. మండలంలో రూ.20లక్షలతో నిర్మించనున్న రాపాకపల్లె నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం సర్పంచ్ కందూకురి వినోద అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మండలంలో రాపాకలపల్లె, నర్సింగరావుపల్లె, కేశవనగర్, కాశేగూడెం, కరుణాపురం గ్రామ పంచాయతీలను కొత్తగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కొత్త గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అనంతరం ధర్మసాగర్‌కు చెందిన విలేకరి బంక రాజ్‌కుమార్ యాదవ్ ఇటీవల మృతిచెందగా బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే రాజయ్య పరామర్శించి, ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో జవహర్‌రెడ్డి, ఎంపీపీ నిమ్మ కవిత, ఎంపీటీసీ శోభ, మండల రైతు కోఆర్డినేటర్ కరుణాకర్, వైస్ ఎంపీపీ రవీందర్, పీఏసీఎస్ వైస్ ఛైర్మన్ యాదకుమార్, మండల పార్టీ అధ్యక్షుడు సోంపెల్లి కరుణాకర్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కర్ర సోమిరెడ్డి, ఏఈ దయాకరచారి, ఏఎంసీ డైరెక్టర్ రజిత, వైఎస్ ఎంపీపీ రవీందర్, టీఆర్ఎస్ నాయకులు బొడ్డు ప్రభుదాసు దేవేందర్, వీరన్న, మహేందర్‌రెడ్డి, రావుల వెంకట్‌రెడ్డి, రమేశ్, సోమయ్య, సుధాకర్, కృష్ణ పాల్గొన్నారు.
తాజావార్తలు
- అమెరికన్ యోధులతో ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ ఫైట్
- బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మంత్రి
- హైవేపై ట్రక్కు భీభత్సం.. ఐదుగురు మృతి
- ఆ సీఎంకు రక్షణగా అందరూ మహిళలే..
- పువ్వాడ ఇంటికి అతిథిగా వెళ్ళిన చిరు, చరణ్
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
- అరబిందో ఫార్మాలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
- అల్లరి నరేష్ చిత్రం ఓటీటీలో విడుదల
- పార్లమెంట్లో కొవిడ్ వ్యాక్సినేషన్
- రాష్ర్టంలో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు