మంగళవారం 31 మార్చి 2020
Wanaparthy - Feb 11, 2020 , 00:34:36

సహకార నామినేషన్ల ఉపసంహరణ పూర్తి

సహకార నామినేషన్ల ఉపసంహరణ పూర్తి

వనపర్తి రూరల్‌ : మండలంలోని సహకార సంఘాలకు ఈనెల 15వ తేదీన జరుగే ఎన్నికల సందర్భం గా దాఖాలైన ఆయా సహకార సంఘం నామినేషనులోని పలువురి అభ్యర్థులు సోమవారం తమ నా మినేషన్లు ఉపసంహరించుకొనున్నట్లు అధికారులు పరిశీలన చేసి జాబితను విడుదల చేశారు. మండలంలోని మూడు సహకార సంఘాలకు 39 డైరెక్టర్‌ స్థానాలకు గాను 83 నామినేషన్‌లు వచ్చా యి. అం దులో నాగవరం సహకార సంఘంలోని 13 వార్డులకు 43 దాఖాలుకాగా వాటిలో 11, 12 వ వార్డు లు  దత్తయిపల్లి డైరెక్టర్‌ల స్థానాలకు టీ శివకుమార్‌, సాతర్ల కురుమయ్యలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 11 వార్డులకు 24 మంది బరిలో ఉండగా 10 మం ది ఉపసంహరణ చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే రాజనగరం 27 నామినేషన్లులో రెం డో వార్డు డైరెక్టర్‌ స్థానం ఏకగ్రీవం కాగా 12 స్థానాలకు 25 మంది బరిలో నిలిచారు. ఒకరు ఉపసంహరించుకున్నారు. వనపర్తి సహకార సంఘంలో దాఖలైన 38 నామినేషన్లు 10 మంది ఉపసంహరణ చేసుకొగా 28 బరిలో ఉన్నారు. తుది జాబితలను ఆయా సహకార సంఘాల నోటీసు బోర్డులలో అధికారులు బరిలో నిలిచిన అభ్యర్థుల వార్డుల వారిగా లిస్టులను అతికించారు. అలాగే అభ్యర్థులకు బీరువా, బ్యాట్‌, టార్చిలైట్‌, గుర్తులను కేటాయించారు. మంగళవారం నుంచి అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేసేందుకు సిద్ధమైనారు.

గోపాల్‌పేటలో..

గోపాల్‌పేట : ప్రాథమిక వ్యవసాయ పరపతి సం ఘం డైరెక్టర్ల స్థానాలకు ఈనెల 15వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఈస్థానాలకు ఉమ్మడి మండ లం నుంచి 41 మంది నామినేషన్లు వేశారు. నామినేషన్ల పరిశీలనలో ఒక నామినేషన్‌ తిరస్కరణకు గు రైంది. సోమవారం జరిగిన నామినేషన్ల ఉపసంవర ణ ప్రక్రియలో నాలుగు డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి నరేశ్‌ తెలిపారు. ఏకగ్రీవమైన స్థానాల్లో పొల్కెపహాడ్‌ 2వ వార్డు నుంచి గువ్వ ల రాములు, ఏదుల 5వ వార్డు నుంచి పీ రాము లు, ఏదుల 6వ వార్డు నుంచి గోపాల్‌, బుద్దారం పాడిగడ్డతండా 13వ వార్డు నుంచి హర్యానాయక్‌లు ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు.

ఖిల్లాఘణపురంలో..

ఖిల్లాఘణపురం : ఖిల్లాఘణపురం పీఏసీసీఎస్‌ పరిధిలో మొత్తం 13 వార్డులకు గాను స్వీకరించిన నామపత్రాల ఉపసంహరణ సోమవారం కొనసాగింది. 13 వార్డులకు గాను 59 నామినేషన్ల దరఖాస్తులలో 24 నామినేషన్లను అభ్యర్థులు ఉపసంహరించుకోగా 35 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు ఎన్నికల అధికారి రఘురాం తెలిపారు. మొత్తం 13 వార్డులలో ఏ ఒక్కరూ కూడా ఏకగ్రీవం కాలేదు. దీంతో 35 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 

పెద్దమందడిలో 

పెద్దమందడి : పెద్దమందడి పీఏసీసీఎస్‌ పరిధిలో 13 వార్డులకు గాను 12 వార్డులలో ఎన్నికలు జరుగనున్నాయి. సోమవారం చేపట్టిన ఉపసంహరణలో మొత్తం 13 వార్డులలో 52 మంది అభ్యర్థులకు గాను 24 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా 27 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 13 వార్డులకు గాను 1వ వార్డు ఏకగ్రీవం కాగా 12 వార్డులకు 27 మంది అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది.


logo
>>>>>>