బుధవారం 08 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 12, 2020 , 03:50:39

నేటి నుంచి సంక్రాంతి సెలవులు

నేటి నుంచి సంక్రాంతి సెలవులు


వనపర్తి విద్యావిభాగం : నేటి నుంచి విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో శనివారం విద్యార్థులు ఇంటిబాట పట్టారు. దీంతో బస్టాండ్‌ ప్రాంగణమంతా కిక్కిరిసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యార్థులను తల్లిదండ్రులు తమ బైకులు, ఆటోలలో తీసుకెళ్లారు. విద్యార్థుల సౌకర్యార్థం రెండు, మూడు రోజుల పాటు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో సహాయ మేనేజర్‌ దేవేందర్‌ తెలిపారు. సాధారణ రోజుల్లో రోజువారీగా రూ.12.5 లక్షల నుంచి రూ.13లక్షల ఆదాయం వనపర్తి డిపోకు సమకూరనుండగా పండుగ వేళలో రూ.లక్ష నుంచి రూ.1.5లక్షల ఆదాయం రానున్నదని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా హైదరాబాద్‌కు రోజువారీగా కాకుండా అదనంగా 45 ట్రిప్పులను నడుపుతున్నట్లు ఆయన వెల్లడించారు.


logo