పాలమూరు-రంగారెడ్డితో లక్షా67వేల ఎకరాలకు సాగునీరు

- 60 శాతం సర్వే పూర్తి
- గ్రంథాలయ భవన నిర్మాణాలకు రూ.కోటి58లక్షలు
- కొడంగల్‌లో ఇరిగేషన్ ఈఈ కార్యాలయం
- ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి
కొడంగల్, ఫిబ్రవరి 10 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో నియోజకవర్గంలో లక్షా67వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 60 శాతం సర్వే పూర్తయిందని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే మున్సిపల్ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో రివ్యూ నిర్వహించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అంశాలను అధికారులతో చర్చించారు. ఈ పథకంతో లక్ష్మీదేవరంపల్లి, ఉద్దండాపూర్ నుంచి నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాల్లో లక్షా67వేల ఎకరాలకు సాగునీరు త్వరలో అందనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి 60శాతం సర్వే పూర్తయిందని, ప్రతి చెరువు కుంటలను నింపి పంట పొలాలకు నీరందించనున్నట్లు పేర్కొన్నారు. చెరువులు, కుంటలు లేని ప్రాంతాల్లో కాలువల ద్వారా నీటిని అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాల్లో శిథిలావస్థకు చేరుకున్న గ్రంథాలయ భవన నిర్మాణాలకు రూ.కోటి58లక్షలు మంజూరయ్యాయని.. త్వరలో పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కొడంగల్‌కు ప్రత్యేకంగా ఇరిగేషన్ ఈఈ కార్యాలయం అందుబాటులోకి వచ్చిందని, కార్యాలయ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మున్సిపల్ పరిధిలోని శాంతినగర్ కాలనీలో జరుగుతున్న మురుగు కాలువ నిర్మాణం పనులను పరిశీలించారు. ఆ తరువాత పట్టణంలోని జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా పరిశీలించి కొవిడ్ ఏర్పాట్లను, తరగతులు నిర్వహణను పరిశీలించారు. పాఠశాలలో నెలకొన్న తాగునీటి, మరుగుదొడ్డి నిర్మాణ పనులను త్వరలో పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ వెంకటలక్ష్మికి ఆదేశాలు జారీ చేశారు. బుల్కాపూర్‌లో మున్సిపల్ నిధులు రూ.40లక్షలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డి, వైస్ చైర్మన్ ఉషారాణి, కౌన్సిలర్లు మధుసూదన్‌యాదవ్, డా.శ్రీలతాయాదవ్, రమేశ్, వెంకట్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యులు మునీర్, శారదమ్మ, సర్పంచ్‌లు సయ్యద్ అంజద్, ఫకీరప్ప, మాజీ సర్పంచ్ రమేశ్‌బాబు, ఇరిగేషన్ ఈఈ జోసఫ్, టీఆర్ఎస్ నాయకులు రామకృష్ణ, డా.నవాజొద్దీన్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- రసవత్తరంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు
- ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. ఏప్రిల్ 9న తొలి మ్యాచ్
- ఐటీ సోదాలు.. బయటపడిన వెయ్యి కోట్ల అక్రమాస్తులు!
- సోనియా అధ్యక్షతన కాంగ్రెస్ స్ట్రాటజీ గ్రూప్ సమావేశం
- వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించండి : మంత్రి కేటీఆర్
- తమిళనాడు, కేరళలో అమిత్‌షా పర్యటన
- కాసేపట్లో మోదీ ర్యాలీ.. స్టేజ్‌పై మిథున్ చక్రవర్తి
- న్యూయార్క్‌లో రెస్టారెంట్ ప్రారంభించిన ప్రియాంక చోప్రా
- ఆరు రాష్ట్రాల్లోనే 84.71 శాతం కొత్త కేసులు: కేంద్రం
- ఫాస్టాగ్ కొంటున్నారా.. నకిలీలు ఉన్నాయి జాగ్రత్త!