బుధవారం 05 ఆగస్టు 2020
Vikarabad - Mar 23, 2020 , 23:40:01

అత్యవసర సేవలు ౩ గంటలే..

అత్యవసర సేవలు ౩ గంటలే..

  • ఉదయం 6 నుంచి 9గంటల వరకే కూరగాయలు, నిత్యావసరాల మార్కెట్లు
  • సరుకుల  పెంచితే చర్యలు
  • ప్రజా రవాణా, ప్రైవేటు వాహనాలు పూర్తిగా బంద్‌
  • ఎవరూ బయటకు రావద్దు
  • ఐదుగురి  ఎక్కువ గుమికూడితే క్రిమినల్‌ చర్యలు
  • సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల కలెక్టర్లు అమయ్‌కుమార్‌, పౌసుమి బసు 

‘లాక్‌డౌన్‌ సమయంలో అత్యవసర సేవలు 3గంటలే పనిచేస్తాయి. ఉదయం 6నుంచి 9గంటల వరకే కూరగాయలు,  మార్కెట్లు  ఉంటాయి.’ అని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల కలెక్టర్లు అమయ్‌కుమార్‌, పౌసుమి బసు అన్నారు. ప్రజా రవాణా, ప్రైవేటు వాహనాలు పూర్తిగా బంద్‌ అవుతాయని, ప్రజలు  బయటకు వెళ్లవద్దని సూచించారు.  కంటే ఎక్కువ గుమికూడితే క్రిమినల్‌ చర్యలు తప్పవని హెచ్చరించారు. సరుకుల  పెంచితే చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ, రంగారెడ్డి కలెక్టర్‌ మాట్లాడారు. తాండూరులో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డులను పరిశీలించిన  కలెక్టర్‌.. అపరిశుభ్రత  నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి,నమస్తే తెలంగాణ: జనతా కర్ఫ్యూలో భాగంగా రెండో రోజు సోమవారం జిల్లాలో బంద్‌ విజయవంతం అయింది. నిత్యావసర సరుకులు, కూరగాయలు, పాలు కేంద్రాలు, కిరాణ దుకాణాలు మినహా అన్ని వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. గ్రామ, పట్టణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. ఫలితంగా వీధులు, రహదారులు జనసంచారం లేక బోసిపోయా యి. జిల్లాలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. జిల్లాలోని రహదారులన్నీ దిగ్భందాన్ని తలపించాయి. అంతర్‌ రాష్ట్ర, జాతీయ రహదారులు, ఔటర్‌ రింగ్‌ రోడ్లు నిర్మానుష్యం గా కనిపించాయి. సోమవారం ఉదయం 6 గంటలకు ముందే చేవెళ్ల, షాద్‌నగర్‌, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి, రాజేంద్రనగర్‌, మహేశ్వరం, ఎల్బీనగర్‌ నియోజకవర్గాల్లో ప్రజలు తెరిచి ఉన్న దుకాణాల నుంచి పాలు, కావాల్సిన సరుకులు తెచ్చుకున్నారు. మార్కెట్‌లో కూరగాయల ధరలు పెంచడంతో జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. రైతులు నేరుగా మార్కెట్లకు కూరగాయలు తెచ్చి అమ్ముకునేలా సౌకర్యాలు కల్పించే దిశగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. రోడ్లపై వాహనాలు రాకపోకలు లేకుండా కట్టు దిట్టమైన చర్యలు చేపట్టారు. మైక్‌లలో సూచనలు చేస్తూ జిల్లాలోని అన్ని పట్టణాలలో గస్తీ తిరిగారు. అన్ని పట్టణాలతో పాటు గ్రామాలలో జనతా కర్ఫ్యూలో భాగంగా బంద్‌ సంపూర్ణంగా జరిగింది. కొన్ని గ్రామాల్లో ప్రజాప్రతినిధులు బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లారు. ముఖ్యమంతి కేసీఆర్‌ పిలుపునకు స్పందించి ఈ నెల 31 వరకు ఇండ్లలోనే ఉండి కరోనా వైరస్‌ను పారదోలేందుకు సిద్ధంగా  ఉందామని జిల్లా ప్రజలు ప్రకటించారు.  

పనిచేసిన పరిశ్రమలు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా వ్యూహంతో పనిజేస్తుంటే దానిని అమలు చేయాల్సిన గురుతరమైన బాధ్యత ఉన్న పారిశ్రామిక వేత్తలు కొందరు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.  కరోనాతో దేశాలకు దేశాలు విచ్ఛిన్నం అవుతుంటే ఇక్కడ కొన్ని కంపెనీలు ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తున్నాయి. షాద్‌నగర్‌, చేవెళ్ల, రాజేంద్రనగర్‌, మహేశ్వరం, ఎల్బీ నగర్‌ నియోజకవర్గ పరిధిలోని ఐటీ ఆధారిత కంపెనీలు, ఇతర పారిశ్రామిక ప్రాంతాల్లో కొన్ని పరిశ్రమలు పొద్దున్నే ఫస్ట్‌ షిఫ్ట్‌ మొదలెట్టాయి. కంపెనీ వద్దకు ఎవరూ రాలేరని, యథేచ్ఛగా గుట్టు చప్పుడు కాకుండా రన్‌ చేశారు. షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని స్పాంజ్‌ ఐరన్‌ పరిశ్రమలు, మరి కొన్ని ఇతర పనిచేశారు. ఎలికట్ట శివారులోని దేవశ్రీ, మొగిలిగిద్ద శివారులోని కేడీయా, నాట్కో, హేమాజాక్షి తదితర పరిశ్రమల్లో కార్మికులు ఆదివారం, సోమవారం పనిచేసినట్లు సమాచారం. కంపెనీలపై పోలీసులు, రెవెన్యూ, పరిశ్రమల శాఖ, లేబర్‌ అధికారులు, కార్మిక సంఘాల నాయకులు చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. 

గచ్చిబౌలిలోని హిల్‌ రిడ్జ్‌ విల్లాస్‌లో ‘హోం క్వారంటైన్‌' పరిశీలన

గచ్చిబౌలిలోని హిల్‌ రిడ్జ్‌ విల్లాస్‌లో ఒక వ్యక్తి విదేశాల నుంచి రావడంతో కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, అడిషనల్‌ కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, జిల్లా వైద్యాధికారుల బృందం అక్కడి వెళ్లి పరిశీలించారు. స్టాంపు వేసి 14 రోజుల పాటు ఇంట్లో ఉండాలని సూచించారు. రోడ్లపై తిరిగిన వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకుని పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ప్రయాణీకులతో వెళ్తున్న ఆటోలను సీజ్‌ చేశారు. జనతా కర్ఫ్యూలో భాగంగా జిల్లాలో పలు చోట్ల ఆయన రోడ్ల తనిఖీలు చేపట్టారు. వాహనాల రాకపోకలకు చెక్‌ పెట్టారు.

లాక్‌ డౌన్‌కు సహకరించాలి

  •  జిల్లా ప్రజలకు కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ విజ్ఞప్తి 

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ను జిల్లాలో సమర్థవంతంగా అమలుచేసేందుకు పూర్తిస్థాయిలో సహకరించాలని ప్రజలకు కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు. జిల్లాలో కరోనా వ్యాప్తి నిరోధానికి పెద్దఎత్తున చర్యలు చేపట్టామని, ఈ విషయంలో అందరి సహకారం అవసరమని అన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కూరగాయల, నిత్యావసర సరుకుల మార్కెట్లు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 వరకు తెరిచి ఉంటాయన్నారు. గుంపులు గుంపులుగా వెళ్లవద్దని, సమీపంలోని దుకాణాలకు మాత్రమే ఒక్కొక్కరు వెళ్లాలని సూచించారు. లాక్‌ డౌన్‌ నేపథ్యంలో పేదలకు ప్రభుత్వం ఇచ్చే బియ్యం, నగదును సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా తగు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించినట్టు కలెక్టర్‌ తెలిపారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు తెల్లరేషన్‌ కార్డ్‌ హోల్డర్లకు బియ్యం నగదు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా జిల్లా సరఫరా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. నిత్యావసర వస్తువుల కొనుగోలుపై వెళ్లే వ్యక్తులు ఒకరికి .. ఒకరికి మధ్య కనీసం నాలుగు అడుగుల దూరం ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈనెల 31వ తేదీ వరకు ప్రభుత్వం ఆదేశాల మేరకు లాక్‌ డౌన్‌ పాటిస్తున్నందున ఎవరూ బయటికి రాకూడదని ప్రతిఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలనికలెక్టర్‌ సూచించారు.

 ప్రజలందరూ సహకరించాలి:  సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌ 

1897 చట్టం కింద లాక్‌డౌన్‌ అమలుచేస్తున్నామని, ప్రజలందరూ సహకరించాలని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ కోరారు. గచ్చిబౌలిలో సోమవారం ఏర్పా టు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ లాక్‌డౌన్‌ వల్ల అంతర్‌ రాష్ట్ర బార్డర్స్‌ మూసివేస్తున్నామన్నారు. ఆర్టీసీ బస్సులు అన్ని బంద్‌ చేయించామని, ప్రజలేవరూ ప్రయాణ  ఏర్పాట్లు చేసుకోవద్దని తెలిపారు. ఎమర్జెన్సీ సేవలకు మాత్ర మే అందుబాటులో ఉంటాయని, ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు రాకుండా ఉండాలని అన్నారు. ఎక్కడ ఐదుగురికంటే ఎక్కువ గుమిగూడా కూడదని, నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జీవో 45 లో ఉన్న ప్రతి అంశాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. పరీక్షలు అన్ని వాయిదా వేస్తున్నామని, ఎవరూ ఆర్భాటాలు చేయవద్దని అన్నారు. రోడ్‌ మీద వాహనాలు నడిపితే సీజ్‌ చేస్తామన్నారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 వరకు  బయట తిరిగితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. అన్ని వ్యాపార, వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూసివేయబడ్డాయన్నారు. ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలన్నారు. కౌంటర్ల వద్ద తప్పనిసరిగా మూడు అడుగుల సామాజిక దూరం పాటించేలా నడుచుకుని, కరోనా వైరస్‌ వ్యాప్తి నిర్మూలనకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.


logo