గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - Feb 02, 2020 , 23:18:45

కాలనీల అభివృద్ధికి కృషి

కాలనీల అభివృద్ధికి కృషి

తాండూరు, నమస్తే తెలంగాణ: మున్సిపల్‌ పరిధిలోని 36 వార్డుల్లోని కాలనీల అభివృద్ధికి పార్టీలకు అతీతంగా ప్రత్యేక నిధులు కేటాయించి సమస్యలన్నీ పరిష్కరిస్తామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న, వైస్‌ చైర్‌పర్సన్‌ దీప అన్నారు. ఆదివారం పట్టణంలోని 24వ వార్డు సీసీఐ కాలనీవాసులు నూతనంగా ఎన్నికైన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న, 24వ వార్డు కౌన్సిలర్‌ సాహు శ్రీలతను ఘనంగా సన్మానించారు. అదే విధంగా పాత తాండూరులో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న, వైస్‌ చైర్‌పర్సన్‌ దీప, 16వ వార్డు కౌన్సిలర్‌ వసంత, 10వ వార్డు కౌన్సిలర్‌ రత్నమాల, 13వ వార్డు కౌన్సిలర్‌ శ్రీనివాస్‌రెడ్డి, 22వ వార్డు కౌన్సిలర్‌ రామకృష్ణను వార్డు ప్రజలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తాండూరు అభివృద్ధికి కృషి చేయడంతో పాటు అర్హులైన ప్రజలందరికీ సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందేల చూస్తామన్నారు. 

హనుమాన్‌ దేవాలయానికి రూ. 51 వేల విరాళం

తాండూరులో అతి పురాతనమైన పాత తాండూరు హనుమాన్‌ దేవాలయం పునర్‌నిర్మాణానికి మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ దీపనర్సింహులు రూ. 51 వేల విరాళంను అందజేశారు. దేవాలయం అభివృద్ధి మునుముందు మరింత సహాయం అందిస్తామని అన్నారు.


logo