బుధవారం 12 ఆగస్టు 2020
Vikarabad - Jan 17, 2020 , 23:37:31

ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలి

ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలి

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ:  ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మస్రత్‌ ఖానమ్‌ ఆయేషా తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ మస్రత్‌ ఖానమ్‌ ఆయేషా మెఫ్మా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఓటును ప్రతి ఓక్కరూ వినియోగించుకునేలా ఓటర్లలో చైతన్యం తీసుకురావాలన్నారు. దీనిలో భాగంగా శనివారం వికారాబాద్‌ ఆర్డీవో కార్యాలయం నుంచి అలంపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల వరకు ఓటర్లకు ఓటు హక్కుపై చైతన్యం కలిగించే విధంగా 2కే రన్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  అదే విధంగా మెఫ్మా, సఖీ కేంద్రాలు, అంగన్‌వాడీ టీచర్లు ఓటరు చైతన్యంపై ముగ్గుల పోటీలు నిర్వహించాలని సూచించారు. మహిళల రక్షణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలకు సంబంధించిన స్టాల్స్‌ను మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ అరుణకుమారి, జిల్లా రెవెన్యూ అధికారి మోతీలాల్‌, వికారాబాద్‌, తాండూరు ఆర్డీవోలు, మెఫ్మా అధికారులు పాల్గొన్నారు.


logo