ప్రతినెలా కేసీఆర్ సర్కారు ఇచ్చే నిధులతో గ్రామాల అభివృద్ధి…

బొంరాస్పేట, ఆగస్టు: గ్రామ పంచాయతీలకు కేసీఆర్ సర్కారు ప్రతినెలా అందిస్తున్ననిధులతో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని వైస్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని చౌదర్పల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ నిధులు రూ.2.50 లక్షలతో నిర్మించే భూగర్భ మురుగు కాల్వ పనులను సర్పంచ్ దోమ వెంకటమ్మతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ గ్రామ పంచాయతీలకు ప్రతినెలా నిధులను మంజూరు చేస్తున్నారని అన్నారు.

ఈ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టి మౌలిక వసతులను కల్పిస్తున్నామని అన్నారు. ఇవేకాకుండా పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామ పంచాయతీలకు లక్షల రూపాయలను ప్రభుత్వం విడుదల చేస్తుందని, ఈ నిధులతో గ్రామాల్లో స్మశాన వాటికలు, కంపోస్టు షెడ్లు, డంపింగ్ యార్డులు, చెత్త సేకరణకు ట్రాక్టర్ కొనుగోలు చేస్తున్నారని అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు పరిశుభ్రంగా మారాయని నారాయణరెడ్డి అన్నారు. సర్పంచ్ దోమ వెంకటమ్మ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ నిధులతో గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజి నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి యాదగిరి, టీఆర్ఎస్ నాయకుడు అంజిలయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Vikarabad-two News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

