మన నగరాలు, పట్టణాల్లో ఎన్ని ఆలయాలున్నా సరే… కొండలు కోనల మధ్య ప్రకృతి ఒడిలో ఒక చిన్న ఆలయం కనిపించినా అక్కడ ఎంతో ఉపశమనంగా అనిపించి మనశ్శాంతిగా కావలసినంతసేపు పూజలు చేసుకుంటాం. కానీ, హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇలాంటి ఆలయాలు కనిపించడం కష్టమే… అయితే భాగ్యనగరం శివార్లలోని ఒక చిన్న కొండ మీద ప్రకృతి సౌందర్యం మధ్య అలలారుతూ… కాలుష్యానికి, రణగొణధ్వనులకు దూరంగా అతి కొద్దిమంది భక్తులతో పూజలందుకుంటోంది ఒక శివలింగం. జనజీవన స్రవంతికి సుదూరంలో దాదాపుగా ఎవరికీ తెలియని ఈ శివలింగాన్ని దర్శించుకుందాం రండి..