కేఫ్ అంటే కేవలం చాయ్ కాఫీనేనా?.. అది ఒకప్పటి మాట. కేఫ్‌లల్లో ఇప్పుడు కల్లు కూడా దొరుకుతుంది. కల్లు అంటే కల్లుగాదు.. నీరా మాత్రమే. ఉదయాన్నే ఫ్రెష్‌గా చెట్టుమీద నుంచి తీసిన నీరాను హైదరాబాదు వాసులకు అందించే ఏర్పాట్లు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది. ట్యాంక్ బండ్ వద్ద నెక్లెస్ రోడ్డులో హుస్సేన్ సాగర్ ఓడ్డున ఆధునిక హంగులతో నీరా కేఫ్‌ను ఏర్పాటు చేసింది. చూడటానికి రెండ్డు కళ్లు సరిపోవట్లేదు. ఎంచక్కా హుస్పేన్ సాగర్ అందాలు చూస్తూ నీరాను సేవించొచ్చు. ఆరోగ్యానికి ఉపయోగపడే పోషకాలు నీరాలో పుష్కలంగా ఉంటాయి. సాధారణంగా ఇది ఓన్లీ ఉదయం పూట మాత్రమే లభిస్తుంది. నీరా కేఫ్‌లో ఏ టైంలోనైనా దొరుకుతుంది. అసలు నీరా కేఫ్ ఎలా ఉంది?… అందులో ఎలాంటి ఏర్పాట్లు చేశారు… దాని ధర ఎంత, ఎప్పుడు ప్రారంభమవుతుంది?.. వంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి