ఆధార్ కార్డు అనేది ఇప్పుడు అత్యంత కీలకమైన డాక్యుమెంట్. ప్రభుత్వ సంబంధిత పనులు, విద్యార్థుల ఎన్రోల్మెంట్.. ఇలా ఏ పనికైనా ఇప్పుడు ఆధార్‌కార్డునే అడుగుతున్నారు. ఈ డాక్యుమెంట్ లేనిదే నిత్యజీవితంలో ఏ పనీ జరగడం లేదంటే అతిశయోక్తి కాదు. అలాగే, ప్రభుత్వం కూడా ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లకు ఆధార్ కార్డును అనుసంధానం కూడా చేస్తోంది. అయితే, ఆధార్‌కార్డు వినియోగదారులకు యూఐడీఏఐ ఇటీవల ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. భద్రత రక్షణలు లేకపోవడం వల్ల బహిరంగ మార్కెట్లో తయారు చేస్తున్న పీవీసీ ఆధార్ కాపీలను ఉపయోగించడాన్ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) నిషేధించింది. మరి ఏ కార్డులను వాడాలి? ఎలా పొందాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.