– ఆర్. సరస్వతి, బోయిన్పల్లి.
ఇల్లు పూర్ణ వెలుగులతో భాసిల్లాలి. అందుకు ద్వారాలు, కిటికీలు ప్రధానాలు అవుతాయి. ఆ ద్వారాల స్థానాలు మంచి-చెడులను నిర్ణయిస్తాయి. ఇలా ఇంటికి నాలుగు వైపులా ద్వారాలు పెట్టుకోవచ్చు. ఏ ఇంటికైనా.. నాలుగు దిక్కులు ఉంటాయి. కానీ, వాటిని మనమే కలిగించాలి. అంటే, ఇంటికి చుట్టూ ప్రదక్షిణ స్థలం ఇచ్చినప్పుడే నాలుగు దిక్కులు నిలబడతాయి. పడమర హద్దుమీద ఇల్లు కట్టినప్పుడు ఆ ఇంటికి పడమర ఉండదు. అప్పుడు అది మూడు దిక్కుల ఇల్లు అవుతుంది. కొందరు దక్షిణం-పడమర ఖాళీ లేకుండా ఇల్లు కడతారు. తద్వారా ఆ ఇల్లు రెండు దిక్కుల ఇల్లు మాత్రమే అవుతుంది. ఇలా దిక్కులు మనమే కల్పింపజేయాలి. అలా ఇంటి చుట్టూ విశాలమైన స్థలం, సరైన కొలమానంతో ఇల్లు కట్టినప్పుడు నాలుగు వైపులా చక్కని ద్వారాలు స్థిరపడతాయి. అది పూర్ణగృహంగా, ఛత్రశాల భవనమై భాసిల్లుతుంది. తూర్పు మధ్యలో ద్వారం పెట్టడం దోషం కాదు. తూర్పును నిర్ధారించడంలో చాలామంది సగభాగం చేసి లెక్కిస్తారు. అది తప్పు. ఇంటికి తూర్పు మధ్యలో, ఇంటి ఈశాన్యంలో కూడా ద్వారాలు పెట్టవచ్చు.
– వి. చంద్రశేఖర్, భువనగిరి.
ఎవరికోసం ఇల్లు కట్టినా.. కట్టుకోగలిగిన స్థలం ఎంపిక చేయాలి. ఇల్లు జీవితంలో.. స్థలం ఎంపికదే ప్రధాన భూమిక. గృహం అనేక గాథలకు నిలయం. అది మనిషి పురోగతికి, తిరోగమనానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇల్లు స్థలం ఈశాన్యం రోడ్డు అని మీరు చెప్పడం నిజమే కానీ, అది విదిక్కుల స్థలం. మీరు అనుకున్నట్టు గొప్ప నేల కాదు.

మీరు పంపిన నక్షలో ఉన్నవి విదిక్కులు. అంటే, మీ ఇంటి స్థలానికి ఆగ్నేయం రోడ్డు, అలాగే ఈశాన్యం రోడ్డు ఉంది. ఆ స్థలం వ్యాపారానికి పనికి వస్తుంది. గృహ జీవితానికి కాదు. కాబట్టి, మీరు అందులో ఇల్లు కట్టకండి. వాణిజ్యపరంగా వాడుకోండి. ఆ వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు.
– వి. రాకేశ్, ఎల్బీ నగర్.
నేటి నిర్మాణ విధానంలో ఇంటికన్నా ఇంటి అందాలపైనే ఎక్కువ ప్రాధాన్యత చూపుతున్నారు. అది గొప్ప విషయం కాదు. ఎలివేషన్ అనేది ఒంటికి వస్త్రధారణలాగా ఉండాలి. నప్పినట్టుగా, ఆకర్షణీయంగా ఉంటూనే.. ఇంటి మూల విషయాలను తుంచకుండా ఉండాలి.

తూర్పు, ఉత్తరం పూర్తిగా కప్పకుండా, ఈశాన్యం బాల్కనీ మూత పడకుండా, ఆగ్నేయం లోపలి భాగం పెరగకుండా, ఈశాన్యాలు త్రెంపు కాకుండా.. ఎలివేషన్ ఉండాలి. చిన్నచిన్న కట్టడాలు తూర్పు-ఆగ్నేయంలో బయటికి పెరిగినా, తగ్గినా దోషం ఉండదు. ఎలివేషన్ అనేది ముక్కుకు ముక్కెర లాగా ఉండాలి. ముక్కును కోసినట్టు ఉండకూడదు.
– పి. శంకర్, పల్లెపహాడ్.
మన గృహ సంప్రదాయంలో ఎన్నో గుణాలు దాగుంటాయి. నలభై ఏండ్ల క్రితం వరకూ మన తెలంగాణ-ఆంధ్ర పల్లెల్లో చూస్తే.. ప్రతి ఇంటిముందు కమ్మల పందిరి, రేకుల పందిరి, వాలు వరండా (వసారా) ఉండేవి. కారణం.. మనది ఉష్ణమండలం. సూర్యుని యూవీ కిరణాలు ఇంటిలోకి దూరకుండా అడ్డుకోవడానికి ఈ పందిరి విధానం చోటు చేసుకుంది. అది హెల్మెట్ లాగా ఇంటిని కాపాడుతుంది. మారిన ఇండ్ల నిర్మాణం, ఆధునిక పోకడలు వాటిని దూరం చేశాయి.

అయినా, కొందరు ఇష్టపూర్వక నిర్మాణదారులు ఇంటి ముందు ఇప్పటికీ పోర్టికో పెట్టుకుంటారు. ఇది పందిళ్లకు ప్రత్యమ్నాయంగా అర్థం చేసుకోవాలి. ఊరిలోని ఇంటికే కాదు.. నగరంలోని ఇంటి ముందుకూడా పందిరి వేసుకోవచ్చు. కానీ, అందుకు తగిన స్థలం ఉండాలి. నిర్మాణ పద్ధతిని అనుసరించాలి. మన శాస్ర్తాలలో ఆరోగ్యం-మనోస్థిమితం అనే అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143