– పార్థసారథి, మాసాన్‌పల్లి
గ్రౌండ్ కలుపుకొని మూడు ఫ్లోర్లు కట్టుకోవచ్చు. గ్రౌండ్ వదిలి కూడా పైనుంచి డూప్లెక్స్ నిర్మించుకోవచ్చు. ఇల్లును కట్టుకునే ముందే లిఫ్ట్, మెట్లు సరైన విధంగా దక్షిణ-పశ్చిమాలలో ప్లాన్ చేసుకోండి. సెట్‌బ్యాక్ పద్ధతిలో కాకుండా రెండు ఫ్లోర్లను సమానంగా కట్టుకోండి. మీరు కట్టాలనుకునే ట్రిప్లెక్స్ ఇంటి చుట్టూ కనీసం దక్షిణ-పశ్చిమాలలో ఆరు అడుగులకు తక్కువకాకుండా, తూర్పు-ఉత్తరాలలో పన్నెండుకు తగ్గకుండా ఖాళీ స్థలం వదలండి.
ఇంతకన్నా ఎక్కువ వదిలినా నష్టమేమీలేదు. మీకున్న స్థలాన్ని బట్టి రోడ్డు తూర్పు-ఉత్తరం దిక్కులలో ఏవైపు ఉన్నాకూడా.. రోడ్డు నుంచి కనీసం మూడున్నర అడుగుల ఎత్తు వరకు ఫ్లోరింగ్ ఉండేలా చూసుకోండి. లోపల మెట్లు విశాలంగా పెట్టినప్పుడు అక్కడ స్లాబ్ కట్టింగ్ వస్తుంది. కాబట్టి ఇంట్లోని తూర్పు లేదా ఉత్తర ఈశాన్యాలలో స్లాబ్ కట్టింగ్ వచ్చేలా చూడండి. శాస్త్రీయంగా అన్ని జాగ్రత్తలతో ఇంటిని నిర్మించుకోండి.
– రాధ, కమ్మరిపల్లి
మీ ఇల్లు ప్లాన్ చూశాను. మీది తూర్పు- దక్షిణం రోడ్డు ఉన్న ఆగ్నేయం బ్లాక్ ఇల్లు. మీ ఇంటికి దక్షిణం నుంచి ఆగ్నేయం దిశగా ఒక రోడ్డు, తూర్పు ఈశాన్యం ఎదురుగా మరో రోడ్డు ఉండటం శుభకరం. వాటినే వీధిచూపులు అంటారు. అలాగే దక్షిణ-నైరుతి నుంచి మరొక వీధి వచ్చి తగులుతున్నది.

అది నైరుతి వీధిపోటు. ఈ నైరుతి వీధిపోటు మంచిది కాదు. మీ ఇంటికి రెండు వీధిచూపులు, ఒక వీధిపోటు ఉంది. ఇవి అరుదుగా ఉంటాయి. వీధి చూపుల మంచి ఫలితంతోపాటు వీధిపోటు ఫలితం కూడా మీరు పొందాల్సి ఉంటుంది. నైరుతి పోటును మార్చడం సాధ్యపడదు. ముందు మీరు ఆ ఇంటిని ఖాళీ చేసి సవరించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆవు పాలు తాగుతున్నాం కాబట్టి పాముకాటు పనిచేయదని అనుకోవద్దు. దేని చెడు దానిదే! వెంటనే ఇల్లు మారండి.
– భానోజు మురళీధర్, షాద్‌నగర్
సంచార జాతే కాదు. ఏడాదికి ఒకటి రెండుసార్లు ఒకచోటు నుంచి మరోచోటుకు మారే ఉద్యోగులపై కూడా అన్ని ప్రభావాలూ ఉంటాయి. కాకపోతే ఫలితం వెంటనే కనిపించదు. ఎన్ని ఇండ్లు మారినా నెగెటివ్-పాజిటివ్ అనేది ఉంటుంది. మంచి ఇండ్లలో ఎంతకాలం ఉన్నారు? చెడు ఇండ్లలో ఎంతకాలం ఉన్నారు? అన్న దానిని బట్టే వాళ్లకు ఫలితాలు అందుతాయి.

ఏ ప్రాంతంలో ఉండాల్సి వచ్చినా ఆయా గృహాలను చూసుకొని.. అవసరమైతే సరిచేసుకొని ఉండవచ్చు. ఈ విధంగా స్థానచలనం ఎక్కువగా ఉండేవారు తెలియకుండానే వాయవ్యం లోపాలు ఉన్న ఇండ్లకు చేరుతుంటారు. ఈశాన్యం త్రెంపు గృహాలను ఇష్టపడతారు. దీనివల్ల ఇంట్లోని పిల్లలకు, స్త్రీలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఇలాంటప్పుడే చూసుకొని ఉండటం, సానుకూల ప్రవర్తనతో నడవటం మంచిది.
– సద్దుల మల్లిక, కొమురవెల్లి
ఇంటి నిర్మాణంలో ఈశాన్య భాగం ద్వారాలు, కిటికీలు ఉన్నప్పుడే ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వస్తాయి. ఆ దిశలో డ్రాయింగ్ రూమ్, స్టడీరూమ్, లివింగ్ పెట్టుకోవడం ఎంతో మంచిది. పైన ఫ్లోర్లో ఆగ్నేయ భాగంలో ఏవీ గది ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. అందులో ఉత్తరం వైపు స్క్రీన్ పెట్టుకొని దక్షిణంలో సీట్లు వేసుకోని వాడుకోవాలి.

లేదంటే పశ్చిమ-వాయవ్యంలో కూడా ఉత్తరం ముఖంగా కూర్చునేలా ఇంట్లో హోమ్ థియేటర్ పెట్టుకోవచ్చు. ఈ దిశల్లోనే క్రమబద్ధంగా సీట్లు కూడా అమర్చుకోవచ్చు. శబ్దం, వెలుగు రాకుండా ఈ గది పూర్తిగా మూసి ఉంటుంది. కాబట్టి, దిశలన్నీ అనుకూలంగా ఉంటాయి. తూర్పు, ఉత్తరం, ఈశాన్యంలో ఈ ఏవీ గది రాకుండా ప్లాన్ చేయండి. అప్పుడే ఇల్లు లైవ్‌గా ఉంటుంది.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143