Divorce Celebrations | పెండ్లి డ్రెస్‌ను మంటల్లో వేసి.. ఫొటోను కాలితో తొక్కి.. విడాకుల్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న మహిళ
Divorce Celebrations | పెండ్లి (Marriage)ని ఎంత వైభవంగా జరుపుకొంటామో.. విడాకుల్ని (Divorce) అంత గుట్టు చప్పుడు కాకుండా తీసుకుంటాం. ఎందుకంటే.. విడాకులు తీసుకున్న మహిళలపై ఈ సమాజంలో నెలకొన్న చిన్నచూపే. అయితే అమెరికాకు (United States) చెందిన ఓ మహిళ మాత్రం విడాకులను ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుని నెట్టింట వార్తల్లో నిలిచింది.
Divorce Celebrations | పెండ్లి (Marriage)ని ఎంత వైభవంగా జరుపుకొంటామో.. విడాకుల్ని (Divorce) అంత గుట్టు చప్పుడు కాకుండా తీసుకుంటాం. ఎందుకంటే.. విడాకులు తీసుకున్న మహిళలపై ఈ సమాజంలో నెలకొన్న చిన్నచూపే. భర్తతో ఎన్ని విభేధాలున్నా సరే అన్నీ భరిస్తూ అతనితో బంధం కొనసాగించాలి. అలా కాకుండా విడాకులు తీసుకుంటే అదేదో నేరంగా పరిగణిస్తుంది మన సమాజం. ఈ క్రమంలోనే వారిని అగౌరవపరిచేలా సూటిపోటి మాటలతో హింసిస్తుంటుంది. అందుకే తమ విడాకుల విషయం బయటికి తెలియకుండా గోప్యంగా ఉంచుతుంటారు చాలామంది మహిళలు.
అయితే అమెరికాకు (United States) చెందిన ఓ మహిళ మాత్రం విడాకులను ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుని నెట్టింట వార్తల్లో నిలిచింది. నార్త్ కరోలీనా (North Carolina)కు చెందిన లారెన్ బ్రూక్ (Lauren Brooke) అనే మహిళ 2012 అక్టోబర్‌లో ఓ వ్యక్తిని మనువాడింది. కొన్ని ఏండ్లు సాఫీగా సాగిన వీరి సంసారంలో కలతలు వచ్చాయి. ఇద్దరి మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా 2021లో విడిపోయారు. అయితే, అమెరికా చట్టం ప్రకారం విడాకులు తీసుకునే ఓ ఏడాది ముందు వరకూ ఇద్దరూ వేరు వేరుగా ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాతే డైవర్స్కి అప్లై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి సరిగ్గా ఏడాది పట్టింది. ఈ ఏడాది జనవరిలో మొత్తానికి ఇద్దరూ తమ వైవాహిక జీవితానికి స్వస్తిపలికి విడాకులు తీసుకున్నారు. ఈ ఆనందాన్ని ఎలాగైనా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంది లారెన్.
ఇందులో భాగంగానే అందమైన రెడ్ కలర్ గౌను ధరించి, చేతిలో డివోర్స్డ్ అనే బ్యానర్‌ను పట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చింది. అనంతరం తన వెడ్డింగ్ రోజు ఎంతో ఇష్టంగా ధరించిన గౌనును మంటల్లో వేసి కాల్చి బూడిద చేసింది. తన పెళ్లి ఫొటోను కాలితో తొక్కి పగలగొట్టింది. కొన్ని ఫొటోలను చేత్తో రెండు ముక్కలు చేసి.. తన తల్లి, స్నేహితుల సమక్షంలో ఎంతో సంతోషంగా విడాకులను సెలబ్రేట్ చేసుకుంది.
‘విడాకులు తీసుకోవడం ఎంత కష్టమో తెలిసొచ్చింది. చాలా బాధను అనుభవించాను. ఎన్నో రోజుల పాటు నరకం చూశాను. ఉదయమే లేచి ఏడ్చేదాన్ని. నా లైఫ్ ఇక్కడితోనే ఆగిపోతుందేమో అనుకున్నాను. కానీ అలా జరగలేదు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. కానీ మా పిల్లల కోసం మాత్రం అప్పుడప్పుడు అతనితో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పుడిక నేను ఏడ్వాల్సిన అవసరం లేదు. చాలా ప్రశాంతంగా, సంతోషంగా ఉంది’ అంటూ లారెన్ చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ‘విడాకులను ఇలా కూడా సెలబ్రేట్ చేసుకుంటారా..?’ అంటూ ఆశ్చర్యపోతున్నారు.
Also Read..
Viral Video | డిస్కౌంట్ సేల్.. ఒకే చీర కోసం జుట్లుపట్టుకుని కొట్టుకున్న మహిళలు
Sudan Crisis | సుడాన్ అల్లర్లలో 400 మంది మృతి.. ప్రమాదంలో చిన్నారుల జీవితం
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

