వాషింగ్టన్: 620 అడుగుల నుండి విసిరిన ఫుట్‌బాల్‌ను క్యాచ్ పట్టుకోవడంతో ఇద్దరు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కారు. అమెరికా జాతీయ ఫుట్‌బాల్ లీగ్ మాజీ కీడ్రాకారుడు, ఆయన కాలేజీ ఫుట్‌బాల్ టీం కోచ్ కలిసి ఈ ఘనత సాధించారు. 2021 ఏప్రిల్ 23న ఆరిజోనాలో ఈ అరుదైన ఫీట్ జరిగింది. టస్కాన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఆరిజోనా ఫుట్‌బాల్ స్టేడియం ఈ ఈవెంట్‌కు వేదికైంది. రాబ్ గ్రోంకోవ్స్కీ చివరిగా ఒక గ్రేట్ క్యాచ్ చేసి చరిత్ర సృష్టించాలని నిర్ణయించారు. ఫుట్‌బాల్ జట్టు ప్రధాన కోచ్ జెడ్ ఫిష్, మాజీ ఆటగాడు డోనీ సలుమ్, నిర్మాణ సంస్థ లిక్విడ్ లైట్ దీనికి సహకరించారు. హెలికాప్టర్ నుంచి 620 అడుగుల ఎత్తు (188.9 మీటర్లు) నుంచి విసిరిన ఫుట్‌బాల్‌ను రాబ్ గ్రోంకోవ్స్కీ తన చేతులతో పట్టుకున్నారు. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కారు.
కాగా, గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఇటీవల ఈ వీడియోను తన అధికార ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సుమారు మూడుల లక్షల మంది దీనిని చూశారు. 33 వేల మందికిపైగా లైక్ చేశారు.
మరోవైపు నెటిజన్లు కూడా ఫన్నీగా కామెంట్లు చేశారు. అంత ఎత్తు నుంచి క్యాచ్ పట్టడం చాలా ఈజీ అని, దీనికి జాతీయ లేదా కాలేజ్ ఫుట్‌బాల్ ప్లేయర్ కావాల్సిన అవసరం లేదని కొందరు పేర్కొన్నారు. ‘నేను కూడా చాలా ఈజీగా క్యాచ్ చేస్తా’ అని ఒకరు, చాలా ఈజీగా కనిపిస్తున్నదని మరొకరు వ్యాఖ్యానించారు.