హైదరాబాద్ బిర్యానీ బోర్ కొట్టిందా? ఈ వెరైటీ బిర్యానీలను ట్రై చేయండి
హైదరాబాద్ బిర్యానీ తిని బోర్ కొట్టిందా? | ఎక్కడ చూసినా హైదరాబాదీ బిర్యానీయే. హైదరాబాద్ దాటి వేరే ప్రాంతం వెళ్లినా.. అక్కడ కూడా హైదరాబాదీ
Hyderabadi Biryani | ఎక్కడ చూసినా హైదరాబాదీ బిర్యానీయే. హైదరాబాద్ దాటి వేరే ప్రాంతం వెళ్లినా.. అక్కడ కూడా హైదరాబాదీ బిర్యానీయే. హైదరాబాద్ బిర్యానీ తిని తిని బోర్ కొట్టిందా? హైదరాబాద్ లోనే హైదరాబాద్ బిర్యానీ కాకుండా.. వెరైటీ బిర్యానీలు తినాలని ఉందా? అయితే మీరు ఈ వెరైటీ బిర్యానీలను ట్రై చేయాల్సిందే.

Hyderabadi Biryani : హైదరాబాద్ లో హైదరాబాదీ బిర్యానీ ఎంత ఫేమస్సో.. బెంగళూరులో దొన్నె బిర్యానీ అంత ఫేమస్. ఇన్ని రోజులు ఆ ట్రెండ్ బెంగళూరులోనే ఉండేది. తాజాగా దొన్నె బిర్యానీ కల్చర్ మన సిటీకి కూడా వచ్చేసింది. హైదరాబాద్ లోని పలు రెస్టారెంట్లలో ఇప్పుడు దొన్నె బిర్యానీ కూడా లభిస్తోంది.
దొన్నె అనే ఆకులతో చేసిన స్పెషల్ బౌల్స్ లో ఈ బిర్యానీని సర్వ్ చేస్తారు. కొత్తిమీర, పూదీన ఆకులతో వండిన అన్నంలో ఫ్రై చేసిన చికెన్ పీసెస్ వేసి దాంట్లో ఉల్లిగడ్డ ముక్కలు, నిమ్మకాయ కలిపి సర్వ్ చేస్తారు. సాధారణంగా రోజూ తినే హైదరాబాద్ బిర్యానీకి ఇది పూర్తిగా వెరైటీగా ఉంటుంది. డిఫరెంట్ టేస్ట్ ను అందిస్తుంది. హైదరాబాద్ లోని కొండాపూర్, అత్తాపూర్, హిమాయత్ నగర్, మాదాపూర్, ఎస్ఆర్ నగర్, తిరుమలగిరి, మియాపూర్, మణికొండ, కేపీహెచ్బీలో దొన్నె బిర్యానీ ఔట్ లెట్స్ ఉన్నాయి.
దొన్నె చికెన్ బిర్యానీతో పాటు దొన్నె మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ లెగ్ సూప్ లాంటి ఇతర స్పెషల్ ఐటెమ్స్ కూడా దొరుకుతాయి.
సత్తిబాబు బిర్యానీ

దొన్నె బిర్యానీతో పాటు సత్తిబాబు బిర్యానీ ప్రస్తుతం హైదరాబాద్ లో ట్రెండ్ అవుతోంది. ఈ బిర్యానీ కేవలం పార్శిల్ గానే లభిస్తుంది. మూసాపేటలోని భవాని నగర్ లో పిల్లర్ నెంబర్ 895 కి సమీపంలో ఈ బిర్యానీ లభిస్తుంది. ఆన్ లైన్ లో ఈ బిర్యానీని ఆర్డర్ చేసుకుంటే 30 నిమిషాల్లో డెలివరీ చేస్తారు. చూడటానికి చాలా సింపుల్ గా కనిపించే సత్తిబాబు బిర్యానీని ఒక్కసారి తింటే అస్సలు వదల్లేరు. స్పెషల్ చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై ఫీస్ బిర్యానీ ఇక్కడ స్పెషల్ గా లభిస్తాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి :
Prawn Biryani | హైదరాబాదీ బిర్యానీల్లో నయా ట్రెండ్ రొయ్యల బిర్యానీ.. ఆరోగ్యానికి ఎంత మంచిదంటే..
ఈ జైలు భోజనం చాలా టేస్టీ !! మీరూ టేస్ట్ చేయాలని అనుకుంటున్నారా?
Hyderabad biryani | హైదరాబాదీ బిర్యానీ ఒక్కటేనా.. ఈ పది బిర్యానీల రుచి చూశారా
బిర్యానీ వెనుక ఇంత కథ ఉందా..? వీడియో
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

