క్వార్టర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? విస్కీనో లేక బ్రాండీ, రమ్, వైన్. ఎందుకంటే.. చాలామంది క్వార్టర్తోనే తాగడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత హాఫ్, ఫుల్.. అలా పెగ్గులు పెరిగిపోతూనే ఉంటాయి. అందుకే.. క్వార్టర్ అనే పేరు అంత ఫేమస్సు.
అయితే.. సీఏ ధావల్ పురోహిత్.. ఆన్లైన్లో సీఏ క్లాసెస్ తీసుకుంటున్నాడు. ఆ సమయంలో ఒక క్వార్టర్ అంటే ఎంత? అనే ప్రశ్నను తన స్టూడెంట్స్‌ను అడిగాడు. ఒక స్టూడెంట్.. అక్కడ ఉండే చాట్ బాక్స్‌లో వెంటనే ఏమాత్రం తడుముకోకుండా 30 ఎంఎల్ అని రాశాడు.
దీంతో.. ఆ ప్రొఫెసర్‌కు చిర్రెత్తుకొచ్చింది. అరె బాబు.. క్వార్టర్ అంటే 30 ఎంఎల్… 180 ఎంఎల్ కాదు.. క్వార్టర్ అంటే.. 3 నెలలు.. అని చెప్పేసరికి.. ఆన్లైన్ క్లాస్‌లో నవ్వులే నవ్వులు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
నెటిజన్లు అయితే ఆ వీడియోను చూసి నవ్వకుండా ఉండలేకపోతున్నారు. సీఏ క్లాసెస్లోనే ఇలాంటివి జరుగుతాయి? అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇంతకీ ఆ ఆన్సర్ ఇచ్చింది ఎవరు? అంటూ నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Pic of the Day : ఈ ఫోటోను చూసి షాక్ అవుతున్న నెటిజన్లు.. ఇంతకీ ఈ ఫోటోలో ఏముంది?
Flood Dining : వెరైటీ రెస్టారెంట్.. దీని గురించి తెలిస్తే వావ్ అనాల్సిందే
ఒకప్పుడు బొగ్గుతోనే పళ్లు తోమేవారు.. ఇప్పుడు అదే బొగ్గుతో కాఫీ, ఐస్‌క్రీంలు తయారీ.. ఎందుకు?
Love Story | డేటింగ్ యాప్‌లో పరిచయమై.. పరిణయమాడిన వృద్ధ ప్రేమికులు
Guinness Record : రెండు చక్రాలపై మూడు చక్రాల బండి.. చెన్నై వాసి గిన్నీస్ రికార్డ్