రను మోండల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓవర్ నైట్ సోషల్ మీడియా స్టార్ అయిపోయింది ఈమె. ఏక్ ప్యార్ కా నగ్మా హై అనే పాట పాడిన రను.. సోషల్ మీడియా స్టార్ అయింది. ఆ తర్వాత ఆమెకు పలు సినిమాల్లో పాటలు పాడే చాన్స్ కూడా వచ్చింది. కొన్ని రోజులు సినిమాల్లో పాటలు పాడటం.. పేదరికం నుంచి లగ్జరీ జీవితాన్ని అనుభవించడం.. ఎవ్వరూ ఊహించని విధంగా రను జీవితం టర్న్ అయింది.
అయితే.. అది ఎక్కువ కాలం నిలవలేదు. ఆ తర్వాత తనకు అవకాశాలు రాలేదు. ఏది ఏమైనా.. తను ఇప్పటికీ సోషల్ మీడియా స్టార్ గానే ఉంది. మళ్లీ తాజాగా లైమ్ లైట్ లోకి వచ్చింది.
ఇటీవల.. మణికే మాగే హితే అనే ఆల్బమ్ సాంగ్ ఎంత పాపులర్ అయిందో తెలుసు కదా. ఆ పాటను తాజాగా రను మోండల్ తన వర్షన్ లో పాడింది. ఆ పాటను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. రను మోండల్ వాయిస్ కు కొందరు ఫిదా కాదా.. రను పాట కన్నా.. ఒరిజినల్ సాంగే బాగుందంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తం మీద రను.. పాడిన ఈ పాటతో మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా రను పాడిన పాటను చూసేయండి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Viral Video : టాలెంట్ ఎవరి సొత్తు కాదు భయ్యా.. మైకెల్ జాక్సన్ తాతలా ఉన్నాడు చూడండి
ఈ చిలుక సిన్నది కాదు.. చిన్న పిల్లలతో దోస్తీ చేస్తుంది..!
Hangover | గుడ్డు తింటే హ్యాంగోవర్ తగ్గిపోతుందా?
బుక్కెడు బువ్వకోసం.. ప్రాణాలనే ఫణంగా పెడుతున్నారు.. ఒడిశాలోని ఓ తెగ బతుకు చిత్రమిది
మా నాన్న వాసన కంపు.. చమత్కారంగా తండ్రిపై కవిత రాసిన ఐదేండ్ల కూతురు