మహిళలపై ముఖేష్ ఖన్నా వివాదాస్పద వ్యాఖ్యలు : శక్తిమాన్‌పై నెటిజన్లు ఫైర్!
సోషల్ మీడియాలో మహిళలపై శక్తిమాన్ నటుడు ముఖేష్ ఖన్నా చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. యూట్యూబ్ చానెల్‌ను నడుపుతున్న ముఖేష్ ఖన్నా పలు అంశాలపై యూట్యూబ్ వేదికగా తన అభిప్రాయాలు వెల్లడిస్తుంటారు.
ముంబై : సోషల్ మీడియాలో మహిళలపై శక్తిమాన్ నటుడు ముఖేష్ ఖన్నా చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. యూట్యూబ్ చానెల్‌ను నడుపుతున్న ముఖేష్ ఖన్నా పలు అంశాలపై యూట్యూబ్ వేదికగా తన అభిప్రాయాలు వెల్లడిస్తుంటారు. తాజా వీడియోలో సెక్స్ కోసం యువకులను ఆకర్షించే యువతుల క్యారెక్టర్‌ను తప్పుపడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
లైంగిక వాంఛలు తీర్చాలని పురుషుడిని కోరేవారు మహిళలు కాదని వారు సెక్స్ వర్కర్లని ముఖేష్ ఖన్నా వ్యాఖ్యానించారు. నాగరిక సమాజానికి చెంది మంచిగా పెరిగిన బాలిక ఎవరూ లైంగిక వాంఛలు తీర్చాలని యువకుడిని కోరదని ఈ వీడియోలో ముఖేష్ ఖన్నా పేర్కొన్నారు. ఇంటర్నెట్లో వలపన్నే మగువల పట్ల పురుషులు జాగ్రత్తగా ఉండాలని ఆయన హితవు పలికారు.
అమాయక పురుషులే లక్ష్యంగా కొందరు మహిళలు రాకెట్లు నడిపి బ్లాక్మెయిల్ చేస్తున్నారని హెచ్చరించారు. మరోవైపు మహిళలు కూడా పరిమితుల్లో ఉండాలని సంప్రదాయాలు, కట్టుబాట్లను గౌరవించాలని అన్నారు. ఇక ముఖేష్ ఖన్నా వ్యాఖ్యలపై నెటిజన్లు భగ్గుమన్నారు. ముఖేష్ ఖన్నా వ్యాఖ్యలపై ఆయన ఓ సెక్సిస్ట్ అని పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
Pay Commission | బేసిక్ పేనా.. అలవెన్సులా.. ఏది పెరిగితే ఆర్థిక భద్రత ఎక్కువ..?
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

