నోకియా 3310 మోడల్ ఫోన్‌ను మింగేశాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
నోకియా 3310 మోడల్ ఫోన్‌ను మింగేశాడు | ఏకంగా నోకియా 3310 మోడల్ ఫోన్‌నే మింగేశాడు. అది ఇప్పటి ఫోన్ కాదు.. 2000 సంవత్సరంలో విడుదలైన ఆ ఫోన్ అప్పట్లో బాగా పాపులర్ అయింది
చిన్నపిల్లలు తెలియకుండా.. వేటినైనా మింగేయడం మనం చూస్తంటాం. మట్టిని తినడం, చిన్న చిన్న రాళ్లను తినడం.. ఇంట్లో ఉన్న ఏవైనా వస్తువులను మింగడం సర్వసాధారణం. కానీ.. 33 ఏళ్లు ఈ వ్యక్తి చూడండి.. ఏకంగా నోకియా 3310 మోడల్ ఫోన్‌నే మింగేశాడు. అది ఇప్పటి ఫోన్ కాదు.. 2000 సంవత్సరంలో విడుదలైన ఆ ఫోన్ అప్పట్లో బాగా పాపులర్ అయింది. దాన్ని బ్రిక్ ఫోన్‌గా చెప్పుకునేవారు. ఎందుకంటే.. ఆ ఫోన్‌ను కిందపడేసినా పగిలేది కాదు. అంత దృఢంగా ఉండేది ఫోన్.

ఆ ఫోన్‌ను ఓ వ్యక్తి మింగేశాడు. అసలు.. ఆ ఫోన్‌ను ఎందుకు మింగాడు.. ఆ ఫోన్‌ను మింగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది.. అనే విషయాలు మాత్రం తెలియదు. మింగేసిన తర్వాత తన కడుపులో నొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ డాక్టర్లు పరీక్షించగా.. స్కాన్ చేయగా తెలిసింది ఏంటంటే.. మనోడి కడుపులో ఫోన్ ఉందని తెలుసుకున్నారు. అసలే.. గట్టి ఫోన్.. అది ఎక్కడ జీర్ణం అవుతుంది.
వెంటనే డాక్టర్లు సర్జరీ చేసి.. ఆ ఫోన్‌ను బయటకు తీసేశారు. ఒకవేళ.. ఆ ఫోన్‌ను బయటకు తీయకుండా అలాగే ఉంటే.. ఫోన్లోని బ్యాటరీ పేలిపోయి.. ఆ వ్యక్తి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడి ఉండేదట. ఈ ఘటన యూరప్ కంట్రీ కొసోవోలో చోటు చేసుకుంది. ఆ ఫోన్ ఆ వ్యక్తి కడుపులోకి వెళ్లాక మూడు పార్టులుగా విడిపోయిందట. ఆ మూడు పార్టుల్లో బ్యాటరీ కూడా ఉండటంతో.. అది పేలిపోతే ప్రమాదం అని భావించిన డాక్టర్లు ఆ వ్యక్తికి వెంటనే సర్జరీ చేసి తన ప్రాణాలు కాపాడారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Barbie doll : బార్బీ డాల్‌లా కనిపించాలని.. ఈ అమ్మడు ఏం చేసిందంటే..?
Viral Video : పెంపుడు బల్లిని వాకింగ్‌కు తీసుకెళ్లాడు.. దాన్ని చూసి అందరూ షాక్..!
ఇంట్లో నుంచి మహిళ అరుపులు.. పోలీసులకు కాల్ చేసిన పక్కింటోళ్లు.. పోలీసులు వచ్చి చూసి షాక్..!
Viral Photo : వలకు చిక్కిన వింత జీవి.. తీరా చూస్తే..!
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

