ఇంట్లో నుంచి మహిళ అరుపులు.. పోలీసులకు కాల్ చేసిన పక్కింటోళ్లు.. పోలీసులు వచ్చి చూసి షాక్..!
ఇంట్లో నుంచి మహిళ అరుపులు | ఓ ఇంట్లో నుంచి మహిళ అరుపులు, కేకలు విన్న పక్కింటి వాళ్లు.. ఏం చేశారో తెలుసా? కనీసం తను ఎందుకు అరుస్తుందో కూడా తెలుసుకోకుండా.. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు.
సాధారణంగా ఏదైనా ఇంట్లో నుంచి అరుపులు, కేకలు వినిపిస్తే ఏం చేస్తాం.. అయ్యో.. ఏమైంది.. ఎందుకలా అరుస్తున్నారు.. అని అనుకుంటాం. అది మన పక్కన ఉండే ఇల్లు అయితే.. డోర్ కొట్టడానికి ట్రై చేస్తాం. ఏమైందో తెలుసుకుంటాం. కానీ.. ఓ ఇంట్లో నుంచి మహిళ అరుపులు, కేకలు విన్న పక్కింటి వాళ్లు.. ఏం చేశారో తెలుసా? కనీసం తను ఎందుకు అరుస్తుందో కూడా తెలుసుకోకుండా.. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. దీంతో ఆ మహిళకు ఏమైందోనని టెన్షన్‌తో పోలీసులు కూడా హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చారు. తన డోర్ తట్టారు. ఇంట్లోకి వెళ్లి చూసి షాక్ అయ్యారు.

ఇంతకీ.. పోలీసులు ఆ ఇంట్లో ఏం చూశారు.. అనేగా మీ డౌట్. వాళ్లు చూసింది ఒక సాలీడును. అవును.. స్పైడర్‌ను చూసే ఆ మహిళ అరిచింది. కేకలు పెట్టింది. ఆమె కేకలు విని… పక్కింటోళ్లు ఫోన్ చేస్తే.. హడావుడిగా పోలీసులు వచ్చి ఆ మహిళ ఎందుకు అరిచిందో తెలుసుకొని నోరెళ్లబెట్టారు.
తన ఇంటికి వచ్చిన పోలీసులను చూసి.. ఆ మహిళ కూడా షాక్ తిన్నది. ఎలాగూ వచ్చారు కదా.. బాబ్బాబు.. ఆ సాలీడును ఇంట్లో నుంచి తీసేయండి.. అంటూ ఆ పోలీసులకు ఆ మహిళ భలే పని అప్పగించింది.
అయితే.. ఆ సాలీడు సాధారణంగా అక్కడా ఇక్కడా తిరిగేది కాదు. కొంచెం పెద్దదిగానే ఉంది. తన బెడ్రూమ్లో బెడ్ మీద అది కనిపించేసరికి.. దాన్ని చూసి ఆ మహిళ గట్టిగా అరిచేసింది. అది తన మీదికే దూసుకొస్తున్నట్టు ప్రవర్తించడంతో.. తను అలాగే అరుస్తూ అన్ని రూమ్‌లకు పరిగెత్తింది. కంటిన్యూగా తన అరుపులు వినేసరికి.. పక్కింటోళ్లు తనకు ఏం జరిగిందో అని పోలీసులకు ఫోన్ చేశారు. మొత్తానికి పోలీసులు అంత దూరం వెళ్లినందుకు ఆ స్పైడర్‌ను తీసుకెళ్లి దూరంగా అడవిలో వదిలేసి.. తిరిగి స్టేషన్ బాట పట్టారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Viral Photo : వలకు చిక్కిన వింత జీవి.. తీరా చూస్తే..!
Viral Video : ఈ ఏనుగును చూసి ఎంతో నేర్చుకోవాలి.. ఎందుకో ఈ వీడియోలో చూడండి
Viral Video : ఫేస్ మాస్క్ పెట్టుకొని బికినీలో యువతి.. ఎయిర్‌పోర్ట్‌లో హల్చల్
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

