ఇంటర్నెట్లో చిన్నారులు డ్యాన్స్ చేసే వీడియోలు నెటిజన్లను అలరిస్తుంటాయి. చాలామంది పిల్లల క్యూట్ ఎక్స్ప్రెషన్స్కు ఫిదా అవుతుంటారు. అలాంటి ఒక వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నది. మెట్రో రైలులో ఓ చిన్నారి చేసిన డ్యాన్స్ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఈ వీడియోను ‘సాహిల్గంభీర్’ అనే యూజర్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ వీడియోలో చిన్న అమ్మాయి పాపులర్ బాలీవుడ్ పాట “మైన్ సే మీనా సే నా సాకీ సే” గిటార్ ట్యూన్‌కి క్యూట్‌గా డ్యాన్స్ చేసింది. చుట్టుపక్కలవారితో సంబంధం లేనట్లు అమాయకమైన ముఖంతో ఆనందంగా నృత్యం చేసింది. ఈ వీడియోను ఇప్పటివరకూ 1,39,101 లైక్‌లు వచ్చాయి.