అత్తారింట్లో భార్యను ఎవరు కొట్టినా భర్తదే బాధ్యత: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: అత్తారింట్లో కుటుంబ సభ్యులు, బంధువులు కొట్టడం వల్ల భార్యకు గాయాలైనా దానికి భర్తదే బాధ్యత అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పంజాబ్‌కు చెందిన ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించింది. తన భార్యకు తగిలిన గాయాలకు తాను కారణం కాదని, తన తండ్రి వల్లే అలా జరిగిందని, తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అయితే కోర్టు మాత్రం అతని వాదనను తోసిపుచ్చింది. అత్తారింట్లో తన బంధువుల వల్ల భార్యకు గాయాలు తగిలినా కూడా అందుకు ప్రధాన బాధ్యత మాత్రం భర్తదే అని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. అతని ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది.
నువ్వేం మనిషివి?
గతేడాది జూన్‌లో లుధియానాకు చెందిన ఓ మహిళ తనను భర్త సహా అత్తింటి వారు హింసిస్తున్నారని, తీవ్రంగా కొట్టారని పోలీసులుకు ఫిర్యాదు చేసింది. దీనిపై తనను అరెస్ట్ చేయకుండా కాపాడాలంటూ ఆ భర్త పంజాబ్, హర్యానా హైకోర్టుకు వెళ్లగా అక్కడ చుక్కెదురవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డేతో కూడిన ధర్మాసనం ఆ భర్తపై తీవ్రంగా మండిపడింది. నువ్వేం మనిషివి? తనను చంపడానికి ప్రయత్నించాడని నీ భార్య చెబుతోంది. మీరు కొట్టడం వల్ల తనకు గర్భస్రావం అయిందని చెప్పింది. భార్యను క్రికెట్ బ్యాట్‌తో కొడతావా? నువ్వేం మనిషివి అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

